రికార్డు స్దాయిలో రూపాయి పతనం.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Stocks
oi-Nageshwara
By Nageswara Rao
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి.. పతనం కొనసాగుతూనే ఉంది. ఈరోజు స్టాక్ మార్కెట్‌లో రూపాయి రికార్డు స్దాయి కనిష్ట విలువను నమోదు చేసుకుంది. మొట్టమొదటి సారి కనిష్ఠానికి చేరుకున్న రూపాయి 62.03 చారిత్రాత్మక రికార్డును నమోదు చేసింది. గతంలో ఆగస్టు 6వ తారీఖున నమోదు చేసిన 61.80 రికార్డును ఈరోజు తిరిగరాసింది. బుధవారంనాడు (ఆగస్టు 14)న రూపాయి మార్కెట్లో 61.43 వద్ద ముగిసిన విషయం తెలిసిందే.
గురువారం ఆగస్టు 15వ తారీఖు కావడం.. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు రావడంతో లావా దేవీలు జరగలేదు. ఇక శుక్రవారం ప్రారంభంలో రూపాయి బుధవారం ముగింపుకు 10 పైసలు లాభపడినప్పటికీ... ఆ తర్వాత వెంటనే నష్టాల్లోకి వెళ్లి చారిత్రాత్మక రికార్డును నమోదు చేసింది. రూపాయి విలువ ఒక్కసారిగా పతనం కావడంతో భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ అత్యధికంగా 741 పాయింట్ల నష్టంతో 18,625 పాయింట్ల వద్ద.. నిఫ్టీ 214 పాయింట్ల నష్టంతో 5,527 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది.