
అంతేకాకుండా కంపెనీ పునరుద్దరణ ప్రణాళికలపై కంపెనీకి స్పష్టత లేదని నివేదికలో పేర్కొన్నారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మాతృసంస్ద యునైటెడ్ బ్రూవరీస్ (హోల్డింగ్స్) ఆడిటర్లు కూడా కింగ్ ఫిషర్‌లో యునైటెడ్ బ్రూవరీస్ భారీగా పెట్టుబడులు పెట్టడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు పది నెలలుగా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కార్యకలాపాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీనితోపాటు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఫ్లైయింగ్ పర్మిట్ గడువు కూడా ముగిసింది. దీంతో ఆడిటర్లు తమ తాజా సమీక్ష నివేదికను కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ బోర్డుకు సమర్పించారు.
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్‌ను దివాలా తీయకుండా కంపెనీ కొనసాగడంపై తమ అనుమానాలను వ్యక్తం చేశారు. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ రూ. 1,157 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం రూ. 7000 కోట్లకుపైగా అప్పులు ఉన్నాయి. గతేడాది అక్టోబర్ 1న కంపెనీ ప్లయింగ్ లెసైన్స్‌ను కేంద్రం సస్పెండ్ చేయగా.. డిసెంబర్ 31తో లెసైన్స్ గడువు కూడా ముగిసింది. రుణ సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఇచ్చిన రుణాలను వసూలు చేసేందుకు గాను నాలుగు ప్రధాన బ్యాంకులు కలిసి ఒక సబ్ గ్రూప్‌గా ఏర్పడ్డాయి. గతంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో 17 బ్యాంకులు కింగ్‌ఫిషర్‌కు రూ.7,500 కోట్ల పైగా రుణాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కంపెనీకి రుణాలిచ్చిన 17 బ్యాంకుల కన్సార్షియంలో భాగస్వామ్యులైన కీలక బ్యాంకుల నుంచి ఈ సబ్‌గ్రూప్ ఏర్పాటైంది. ఈ సబ్‌గ్రూప్‌లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), పీఎన్‌బీ, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications