
తీసుకున్న రుణంతో పాటు ఇప్పుడు ఆ మొత్తం రూ. 297 కోట్లకు చేరింది. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనందుకు ఈ ట్రేడ్ మార్కులను వేరే వారికి విక్రయించాలని ఐడీబీఐ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. ఎవరైతే ఎక్కువ ధర ఆఫర్ చేస్తారో వారికి ఈ ట్రేడ్ మార్కులను విక్రయించనున్నట్లు బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. దీనితో పాటు డెక్కన్ క్రానికల్ హొల్డింగ్స్ లిమిటెడ్(డీసీహెచ్ఎల్) తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనందుకు గాను ఆ సంస్దకు చెందిన నాలుగు ట్రేడ్ మార్కులను వేలం వేసేందుకు పరిమిషన్ ఇవ్వాల్సిందిగా ఐడీబీఐ బ్యాంకు ముంబై శాఖ రుణ వసూళ్ల ట్రిబ్యునల్ (డీఆర్‌టీ)ను ఆశ్రయించింది. ఈ మేరకు మంగళవారం డీఆర్‌టీలో పిటిషన్ దాఖలు చేసింది.
మీడియా సంస్ద డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ అప్పులు మొత్తం సుమారు రూ. 3270 కోట్ల మేరకు ఉన్నట్లు తేలిందని సమాచారం. డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లు ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ. 490 కోట్లు, యాక్సిస్ బ్యాంకు రూ. 400 కోట్లు, కెనరా బ్యాంక్ రూ 330 కోట్లు, ఆంధ్రా బ్యాంక్ రూ. 200 కోట్లు, యస్ బ్యాంక్ రూ. 175 కోట్లు, ప్యూచర్ క్యాపిటల్ హోల్టింగ్స్ కు రూ. 170 కోట్లలతో పాటు కార్పోరేషన్ బ్యాంక్, కోటాక్ మహేంద్ర బ్యాంక్, టాటా క్యాపిటల్, ఇండియా బుల్స్ మొదలగున వాటికి రూ. 100 కోట్లు వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటితో పాటు చిన్న చిన్న ఆర్దిక సంస్దలకు రూ. 70 నుండి రూ. 75 కోట్ల వరకు బకాయి పడింది.
డక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌కు హైదరాబాద్‌లోని శేరిలింగపల్లిలో ఉన్న ప్రింటింగ్ కార్యాలయాల్లో ఒకదానిని కోటక్ మహీంద్రా బ్యాంక్ సీజ్ చేసింది. ఇక వివరాల్లోకి వెళితే కోటక్ మహీంద్రా బ్యాంక్ గతంలో డక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌కు రుణం ఇచ్చింది. ఆ రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో ఆ మొత్తం ఇప్పుడు రూ. 50.25 కోట్లకు పెరిగింది. తీసుకున్న రుణం చెల్లింపు విషయంలో విఫలమైనందుకు గాను డెక్కన్ క్రానికల్ ప్రింటింగ్ కార్యాలయానికి తాళం వేసిన విషయం తెలిసిందే.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications