వడ్డీ రేట్లను పెంచే ఆలోచన లేదు: ఎస్‌బీఐ ఛైర్మన్ ప్రతీప్ ఛౌదురి

ప్రస్తుత సమీక్షా కాలంలో వ్యవసాయం నుండి రూ. 3,245 కోట్లు, ఎస్‌ఎంఈ విభాగం నుంచి రూ. 2,500 కోట్ల చొప్పున మొండిబకాయిలు నమోదైనట్లు ప్రతీప్ ఛౌదురి వివరించారు. కొత్తగా నమోదైన రూ. 13,766 కోట్ల మొండిబకాయిల కారణంగా మొత్తం ఆస్తులలో స్థూల మొండిబకాయిలు 4.99% నుంచి 5.56%కు పెరిగినట్లు వెల్లడించారు. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 12% తగ్గి రూ. 4,299 కోట్లకు పరిమితమైంది. అంతక ముందు రూ. 4,875 కోట్లుగా నమోదైంది.
ఇక అమెరికా ట్రెజరీ బిల్లుల ద్వారా ఏర్పడ్డ నష్టాలకు రూ. 576 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టినట్లు వెల్లడించారు. ఉద్యోగ సంబంధిత పెన్షన్లకు మరో రూ. 700 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. ఉద్యోగుల సగటు జీవితకాల అంచనాను ఎల్‌ఐసీ ఐదేళ్లు పెంచడం ద్వారా 81 ఏళ్లకు చేర్చడంతో పెన్షన్ కేటాయింపులను చేపట్టాల్సి వచ్చినట్లు తెలిపారు. చివరగా స్‌బీఐ అనుబంధ కంపెనీల గ్రూప్ ఎగ్జిక్యూటివ్, ఎండీ ఎస్.విశ్వనాథన్ మాట్లాడుతూ అనుబంధ బ్యాంకును ఒకదానిని విలీనం చేసుకునే విషయాన్ని సెప్టెంబర్ నెలాఖరులోగా ప్రకటిస్తామని చెప్పారు.
వన్ఇండియా మనీ తెలుగు


Click it and Unblock the Notifications