అంచనా కన్నా తక్కువ ఉత్పత్తి.. జరిమానా విధించండి: డీజీహెచ్

Reliance Industries
న్యూఢిల్లీ: కేజీ-డీ6 క్షేత్రంలో అంచనా కన్నా తక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్)పై అదనంగా 781 మిలియన్ డాలర్ల (సుమారుగా రూ. 4600 కోట్లు) జరిమానా విధించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) ప్రభుత్వానికి సూచన చేసింది. దీంతో ఇప్పటిదాకా ఆర్‌ఐఎల్‌పై విధించిన జరిమానా మొత్తం 1.786 బిలియన్ డాలర్ల(సుమారు రూ.10,700 కోట్లు)కు చేరినట్లయింది.

2012-13లో రోజుకు 86.73 మిలియన్ మెట్రిక్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం కాగా.. సగటున 26.07 ఎంసీఎండీ మాత్రమే ఉత్పత్తి చేసిందని గన నెల 22న చమురు శాఖకు రాసిన లేఖలో డీజీహెచ్ పేర్కొంది. దీంతో కేజీ క్షేత్రంపై పెట్టిన పెట్టుబడుల్లో 1.786 బిలియన్ డాలర్ల వ్యయాలను ఆర్‌ఐఎల్ రికవరీ చేసుకోవడాన్ని అనుమతి ఇవ్వలేదని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) 80 ఎంసీఎండీ మేర గ్యాస్ ఉత్పత్తి చేయడానికి సరిపడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినా.. ప్రస్తుతం 14 ఎంసీఎండీ మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. రిలయన్స్ ముందుగా చెప్పిన స్థాయిలో సహజ వాయువుని తవ్వకపోవడం వల్లే ఉత్పత్తి క్షీణించిపోయాయని, దీంతో మౌలిక సదుపాయాలు నిరుపయోగంగా మారాయని డీజీహెచ్ ఆరోపించింది. వ్యయాల రికవరీని అనుమతించకపోవడం వల్ల ఆర్‌ఐఎల్ అదనంగా లాభాల్లో వాటాల కింద 2012-13 ఆర్థిక సంవత్సరానికి 114 మిలియన్ డాలర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని డీజీహెచ్ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

వన్ఇండియా మనీ తెలుగు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+