ముంబై: ఆటోమెటెడ్ టెల్లర్ మిషన్ (ఏటీఎం) సేవలు మరింతగా మెరుగుపరచే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఏటీఎంలలో డబ్బు లేని పక్షంలో ఆ విషయాన్ని లావాదేవీలు జరపడానికి వచ్చిన కస్టమర్లకు ముందుగానే తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐ అన్ని బ్యాంకులకు సూచించింది. కస్టమర్లు ఏటీఎంలలో లావాదేవీలు జరపడానికి వచ్చినప్పుడు డబ్బు లేని విషయాన్ని స్క్రీన్‌పై నోటీసు రూపంలోనైనా డిస్‌ప్లే చేయాలని ఆదేశించింది.
దీనితో పాటు డబ్బు లేని సందర్బంలో ఫిర్యాదు ఫారాలు, ఎవరికి ఫిర్యాదు చేయవచ్చో వారి పేర్లు, ఫోన్ నంబర్లు, ఏటీఎం ఐడీ మొదలైనవి ఏటీఎం కేంద్రంలో కచ్చితంగా ఉంచాలని సూచించింది. వీటితో పాటు టోల్ ఫ్రీ నంబర్లను కూడా ప్రముఖంగా కనిపించేలా ప్రదర్శించాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఇక, మోసపూరిత విత్‌డ్రాయల్స్‌ని అరికట్టే దిశగా.. లావాదేవీలు జరిపేటప్పుడు ప్రతి దశలోనూ.. నిర్ణీత సమయంలో స్క్రీన్ మారిపోయేలా ఏటీఎం మెషీన్‌లో ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. మోసాలను అరికట్టేందుకు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సాధనాలపై ఖాతాదారుల్లో అవగాహన పెంచాలని సూచించింది.
ఇటీవల కాలంలో రూపాయి మారకపు విలువ తగ్గడంతో దానికి అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరిన్ని చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) కచ్చితంగా అవసరమైతేనే హెడ్జింగ్ చేసేలా నిబంధనలు కఠినతరం చేసింది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications