సహారా చీఫ్ సుబ్రతో రాయ్‌ని శిక్షించాల్సిందే: సుప్రీం కోర్టుకి సెబీ విజ్ఞప్తి

నిధులు వసూలు చేసిన రెండు సంస్థలు సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ (ఎస్‌ఐఆర్‌ఈసీ), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ (ఎస్‌హెచ్‌ఐసీ)లపై, ఆ సంస్థల డెరైక్టర్లపై సైతం ‘కోర్టు ధిక్కార' చర్యలు తీసుకోవాలని సెబీ విజ్ఞప్తి చేసింది. రెండు సహారా గ్రూప్ సంస్థలకు సుప్రీంకోర్టు ఈ నెల 24వ తేదీన కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. మార్కెట్ రెగ్యులేటరీ నియంత్రణ సంస్ద సెబీ ద్వారా ఇన్వెస్టర్లకు రూ. 19,000 కోట్లు తిరిగి చెల్లింపుల విషయంలో తన ఉత్తర్వులను ఎందుకు పాటించలేదో చెప్పాలని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జేఎస్ కేహార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై నిన్న జరిగిన విచారణలో సుప్రీంకోర్టుకు సెబీ తన వాదనలు వినిపించింది. కేసులో వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 6వ తేదీకి వాయిదా వేసింది.
ఐతే రెండు సంస్థలు డబ్బు తిరిగి చెల్లించనందుకు తనను శిక్షించడం సరికాదని సహారా ఛైర్మన్ సుబ్రతో రాయ్ తన వాదనలో పేర్కొన్నారు. ఐతే ఈ వాదనను సెబీ తిరస్కరించింది. రెండు సంస్థల్లో రాయ్‌కి 70 శాతం వాటా ఉందని, అంతే కాకుండా రెండు కంపెనీల ప్రమోటర్ కావడంతో కోర్టు ధిక్కారణ చర్యలకు రాయ్ అర్హుడేనని సెబీ తన వాదనలో వినిపించింది. కోర్టు ధిక్కరణ చట్టం 12వ సెక్షన్ ప్రకారం ఆరు నెలల వరకూ జైలుశిక్ష లేదా జరిమానా విధించాలని సీనియర్ అడ్వకేట్ అరవింద్ దత్తార్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.
సహారా గ్రూప్ కంపెనీల కేసులో జప్తు ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఆ గ్రూప్‌కు చెందిన రూ. 52 కోట్ల నగదు, పెట్టుబడులను సెబీ తన ఆధీనంలోకి తీసుకుంది. అంతేకాకుండా 450 ఎకరాల స్దలాన్ని క్రయ విక్రయాలు జరగనివ్వకుండా అడ్డుకుంది. మార్కెట్ రెగ్యులేటరీ నియంత్రణ సంస్ద సెబీ ఆదేశాలకు అనుగుణంగా డిపాజిట్ల రూపంలో ఉన్న రూ. 23 కోట్లను బ్యాంకులు ప్రత్యేకంగా సెబీ ఏర్పాటు చేసిన ఖాతాకు బదిలీ చేశాయి. దీనిపై సెబీ అధికారులు మాట్లాడుతూ మ్యూచవల్ ఫండ్‌లలో పెట్టిన రూ. 28 కోట్ల విలువైన పెట్టుబడులు, డీమ్యాట్ ఖాతాలను స్దంభింప చేసింది.
వన్ఇండియా మనీ తెలుగు


Click it and Unblock the Notifications