బెంగుళూరు: దేశయ ఐటీ దిగ్గజం విప్రో 2013-14వ తొలి ఆర్దిక సంవత్సరంలో మెరుగైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన విప్రో నికరలాభం 11 శాతం వృద్ది చెంది రూ. 1,623 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే త్ర్రైమాసికంలో రూ. 1,466 కోట్లను మాత్రమే ఆర్జించింది. మెరుగైన లాభాలను ప్రకటించడానికి గల కారణం ఐటీయేతర బిజినెస్‌లను ప్రత్యేక కంపెనీగా విడదీయడం ఒకటి కాగా.. రెండోది భారీ కాంట్రాక్ట్‌లను పొందడంతోపాటు, ఔట్‌సోర్సింగ్ సేవలకు డిమాండ్ పుంజుకోవడమేనని కంపెనీ పేర్కొంది.
ఇక Q1లో కంపెనీ అమ్మకాలు మొత్తం 5 శాతం పెరిగి రూ. 9,733 కోట్లను ఆర్జించింది. జూన్ నుండి అమల్లోకి వచ్చే విధంగా ఉద్యోగులకు జీతాలను పెంచినట్లు విప్రో కంపెనీ సీఎఫ్‌వో సేనాపతి తెలిపారు. ఆఫ్‌షోర్ ఉద్యోగులకు సగటున 6-8% పెంపును అమలు చేయగా, ఆన్‌సైట్ సిబ్బందికి 2-3% స్థాయిలో జీతాలను పెంచినట్లు వెల్లడించారు. ఇక ఈ ఏడాదికి విప్రో 165 కోట్ల డాలర్ల ఆదాయాన్ని సాధించగలమని అంచనా వేసింది. ఇది ఇలా ఉంటే విప్రోతో పోలిస్తే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్పోసిస్ మెరుగైన ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే.

Q1 ముఖ్యాంశాలు:
ఐటీ ఉత్పత్తుల ఆదాయం సంవత్సర ప్రాతిపదికన 15% తగ్గి రూ. 817 కోట్లకు పరిమితమైంది.
ఐటీ సర్వీసుల విభాగంలో 1,469 మందిని కొత్తగా నియమించుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1,47,281కు చేరింది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications