జీతంతో పోలిస్తే మంచి కంపెనీకే ప్రాధాన్యతనిస్తున్న ఉద్యోగార్దులు: సర్వే

ఐటీ కాకుండా ఇతర విభాగాల ఇంజనీర్లు తొలుత రక్షణ పరిశోధన, అభివృద్ది సంస్ద (డీఆర్డీవో)ని గాని, లేకపోతే ఎల్ అండ్ టీని గాని ఎంచుకుంటున్నారు. ఆ తర్వాతి స్దానాల్లో టాటా మోటార్స్ లేదా టాటా స్టీల్ లో ఉద్యోగం కోసం చూస్తున్నట్లు సర్వే నివేదికలో పేర్కొంది. ఇక ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు కోక్-కోలా, భారతీ ఎయిర్‌టెల్‌లు ఫేవరేట్‌లుగా నిలవగా, తర్వాతి స్థానాల్లో పెప్సీ, శామ్‌సంగ్ ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ మేనేజర్, నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్, ఇంజనీర్, అకౌంటెంట్, సాప్ట్ వేర్ డెవలపర్ వంటి ఉద్యోగాలు భర్తీ చేయడం కంపెనీలకు కష్టతరంగా మారుతుందని సర్వేలో తేలింది.
సర్వే ముఖ్యాంశాలు:
* భద్రతా సిబ్బందిని నియమించుకోవడానికి అమెరికా, రష్యాలు ఎక్కువ కష్టాలను ఎదుర్కొంటున్నాయి.
* నిర్మాణ కార్మికుడు, ట్రేడ్ పర్సన్ నియామకాలు జపాన్‌కు కష్టమవుతున్నాయి.
* అర్హులైన అభ్యర్దులు దొరకకపోవడంతో గిరాకీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
* భారత్‌లో ఐటీ మేనేజర్, నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్, ఇంజనీర్, అకౌంటెంట్, సాప్ట్ వేర్ డెవలపర్ వంటి ఉద్యోగాల భర్తీకి చాలా సమయం పడుతుంది.


Click it and Unblock the Notifications