సెబీకి మరిన్ని (ఆస్తుల జప్తు, సోదాలు, అరెస్టులకు ఆదేశం, సెటిల్‌మెంట్) అధికారాలు

ఆయాదేశాల్లోని నియంత్రణ సంస్దల నుండి సమాచారాన్ని పొందడానికి వాటితో ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. దీనికి మాత్రం ముందుగా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. విచారణ అవసరం అని భావిస్తే బ్యాంకులు, కంపెనీలు, బోర్డుల నుండి వ్యక్తుల వ్యక్తిగత సమాచారంతో పాటు రికార్డులను కూడా పరిశీలించవచ్చు. ఎలక్ట్రానిక్ రూపంలో నిర్వహిస్తున్న సమాచారాన్ని పొందడానికి కూడా సెబీకి అధికారం లభించింది. దీనితోపాటు సెబీ దర్యాప్తు చేస్తున్న వ్యక్తిగత, కంపెనీల పెండింగ్ కేసులను సెటిల్‌మెంట్ చేసే అవకాశం లభిస్తుంది. అయితే, ఆరేళ్లకు పైబడి పెండింగ్‌లో ఉన్న ఇలాంటి కేసులకు మాత్రమే ఈ సెటిల్‌మెంట్ వీలవుతుంది. 2012, ఏప్రిల్ 20 తేదీ నుంచి లెక్కించిన పాత కేసులకు మాత్రమే సెటిల్‌మెంట్ వర్తిస్తుంది. సెటిల్‌మెంట్ అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకోవడం, తిరస్కరించడం లాంటి అధికారం సెబీ నిర్ణయానికే వదిలేశారు.
పశ్చిమ బెంగాల్‌లో శారదా చిట్‌ఫండ్ స్కామ్ తదితర భారీ కుంభకోణాలు వెలుగుచూడటంతో ప్రభుత్వం కూడా వీటికి చెక్ చెప్పేవిధంగా సెబీకి అధికారాలు కట్టబెట్టింది. ఇక నుంచి రూ.100 కోట్లు పైబడి నిధులను సమీకరించే స్కీమ్‌లన్నింటినీ కలెక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్(సీఐఎస్)లుగానే పరిగణిస్తారు. వీటిని పర్యవేక్షించే, నిబంధనలు ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకునే అధికారం సెబీకి లభించింది. సెబీని నియంత్రించే మూడు చట్టాల ((సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) చట్టం, సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ చట్టం(ఎస్‌సీఆర్‌ఏ), డిపాజిటరీస్ చట్టం)ను ప్రభుత్వం మార్పులు చేసింది. తాజాగా ప్రభుత్వం జారీచేసిన 16 పేజీల ఆర్డినెన్స్‌లో ఈ మూడు చట్టాల్లో 22 మార్పులు చేసి సెబీకి మరిన్ని అధికారాలు కట్టబెట్టింది.
వన్ఇండియా మనీ తెలుగు


Click it and Unblock the Notifications