
ఇక పారిశ్రామిక మండలి అసోచాం వార్షిక సమావేశంలో ప్రధాని మన్మోహాన్ సింగ్ మాట్లాడుతూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రవాహాన్ని పెంచేలా మరిన్ని సంస్కరణలకు కట్టుబడి ఉన్నామని ఉన్నారు. అదేవిధంగా మందగమనంలో ఉన్న వృద్ధిరేటుకు ఊతమిచ్చేలా మౌలికరంగంలో కూడా పలు చర్యలను తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇటీవలే టెలికం రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 100 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే కొత్త బ్యాంకింగ్ లైసెన్సులను జారీ చేయనుందని మన్మోహాన్ అన్నారు.
‘సింగిల్ బ్రాండ్, మల్టీ బ్రాండ్ రిటైల్, పౌర విమానయానం, విద్యుత్ ఎక్స్ఛేంజీలతోపాటు ఇంకా అనేక రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనలను సరళీకరించాం. మరిన్ని ఎఫ్‌డీఐ సంస్కరణలకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గతేడాది చక్కెర రంగంపై ప్రభుత్వ నియంత్రణలను ఎత్తివేశాం. రైల్వే చార్జీలను దశాబ్దకాలం తర్వాత తొలిసారి పెంచామని ప్రధాని మన్మోహాన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో కొత్తగా రెండు మేజర్ పోర్టుల ఏర్పాటుతోపాటు... నవీముంబై, జుహు, గోవా, పుణే, కన్నూర్‌లలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా సమస్యలతో కొట్టుమిట్టాడుతోందన్నారు. ఈ ఏడాదికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 6.5 శాతం స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిరేటు లక్ష్యాన్ని అందుకోవడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. బడ్జెట్‌లో ప్రకటించిన ఈ లక్ష్యం కంటే వృద్ధి తగ్గే అవకాశం ఉందని కూడా చెప్పారు. అయితే, ఆర్థిక వ్యవస్థ మూలాలు చాలా పటిష్టంగానే ఉన్నాయని... దీనికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలూ తీసుకుంటోందన్నారు.
వన్ఇండియా మనీ తెలుగు


Click it and Unblock the Notifications