ముంబై: భారతదేశపు నెంబర్ వన్ ఐటీ సంస్ద టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 3,831 కోట్లను ఆర్జించింది. గత ఏడాది ఇదే క్వార్టర్ రూ. 3,318 కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన లాభం 15.5 శాతం. కొత్త ఆర్డర్లు రావడం.. ఫారెక్స్ రాబడులు పెరగడం లాభాలకు కారణాలుగా అభివర్ణించారు. ఈ ఏడాది Q1లో మొత్తం ఆదాయం రూ.14,869 కోట్ల నుంచి రూ.17,987 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన 21 శాతం పెరిగింది. ఇక త్రైమాసికంగా చూస్తే 9.5 శాతం వృద్ధి సాధించింది. టీసీఎస్ ఫలితాలు వెల్లడించక ముందు స్టాక్ బ్రోకరేజి సంస్థల విశ్లేషకులు సగటున లాభం రూ.3,765 కోట్లు, ఆదాయం రూ.17,620 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. ఈ అంచనాలను తల్లక్రిందుకు చేస్తూ మెరుగైన ఫలితాలను టీసీఎస్ ప్రకటించింది.
ముఖ్యాంశాలు:
* రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై కంపెనీ రూ.4 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.
* ఐటీ సేవల వ్యాపారం ద్వారా అమ్మకాల వృద్ధి Q1లో ఏకంగా 6.1 శాతంగా నమోదైంది.
* స్థూలంగా 10,611 మంది సిబ్బందిని కంపెనీ నియమించుకుంది. అయితే, Q1లో 9,221 మంది ఉద్యోగులు కంపెనీని వీడటంతో నికర నియామకాలు 1,390కి పరిమితమయ్యాయి.
* జూన్ చివరినాటికి టీసీఎస్‌లో మొత్తం సిబ్బంది సంఖ్య 2,77,586కి చేరింది. ఐటీ విభాగంలో సిబ్బంది వలసల రేటు 9.55 శాతం కాగా, బీపీఓ విభాగంలో ఇది భారీగా 15.77 శాతంగా ఉంది.
ఫలితాల అనంతరం టీసీఎస్ ఎండీ, సీఈఓ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ ఈ త్రైమాసికంలో కూడా మంచి ఫలితాలను నమోదుచేశాం. అమెరికా సహా అన్ని మార్కెట్ల నుండి ఆదాయాలు పెరగడంతో మంచి పనితీరుని సాధించాం. ఇక పోతే Q1లో 10 కోట్ల డాలర్లకు పైగా విలువైన రెండు కాంట్రాక్టులను దక్కించుకున్నామని అన్నారు. యూరప్‌లో మేము పెట్టిన పెట్టుబడులకు అనుగుణంగా మంచి ఫలితాలు రాబట్టడమే దేశీయ ఐటీ పరిశ్రమలో అందరికంటే మెరుగైన వృద్ది సాధించేందుకు సాయపడిందన్న్నారు.
వన్ఇండియా మనీ తెలుగు
Share This Article
English summary
అంచనాలకు మించి లాభాలను ఆర్జించిన టీసీఎస్ | TCS strikes record high on good Q1 result | అంచనాలకు మించి లాభాలను ఆర్జించిన టీసీఎస్
IT major TCS hit record high after reporting good Q1 results after trading hours on Thursday, 18 July 2013. Other IT stocks were boosted by good Q1 results from TCS.
Story first published: Friday, July 19, 2013, 12:29 [IST]
Other articles published on
Jul 19, 2013