
తన ఉత్తర్వుల ప్రకారం సహారాపై చర్యలు తీసుకోకుండా మార్కెట్ రెగ్యులేటరీ నియంత్రణ సంస్ద సెబీని అడ్డుకొన్నందుకు గాను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (శాట్)కు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కెఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జెఎస్ శేఖర్ కూడిన ధర్మాసనం తప్పుబట్టింది. ఆగస్టు 31లోగా సొమ్మును సహారా గ్రూప్ చెల్లించకుంటే కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలంది. ఐతే దీనికి సంబంధించిన ఉత్తర్వులను మాత్రం జారీ చేయలేదు. సుబ్రతో రాయ్ వాదనలు వినాలని.. అప్పటివరకూ ఈ మేరకు ఉత్తర్వులను ఇవ్వవద్దని సుబ్రతా రాయ్ న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కేసు తదుపరి విచారణను జూలై 24కు వాయిదా వేసింది.
3 కోట్ల మంది మదుపుదారులకు ఇవ్వాల్సిన రూ. 24,000 కోట్లను వారికి తిరిగి చెల్లించడానికి వీలుగా సెబీ వద్ద ఆడబ్బును జమ చేయనందుకు సహారా గ్రూప్‌పై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. డబ్బు తిరిగి చెల్లించే వ్యవహారానికి సంబంధించి అలహాబాద్ హైకోర్ట్, శాట్‌ల ముందు పెండింగులో ఉన్న అన్ని పిటిషన్లను తన ముందుకు బదిలీ చేయాలని సైతం ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. డబ్బు తిరిగి చెల్లించేందుకు గాను సంబంధించి 2012 ఆగస్టు 31న తాము ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించి ఏ హైకోర్టుకానీ, ఎస్‌ఏటీ కానీ ఎటువంటి ఆదేశాలూ ఇవ్వరాదని సైతం సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఈ విషయంలో ఎస్‌ఏటీ సైతం జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. సహారా గ్రూప్ కంపెనీల కేసులో జప్తు ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఆ గ్రూప్‌కు చెందిన రూ. 52 కోట్ల నగదు, పెట్టుబడులను సెబీ తన ఆధీనంలోకి తీసుకుంది. అంతేకాకుండా 450 ఎకరాల స్దలాన్ని క్రయ విక్రయాలు జరగనివ్వకుండా అడ్డుకుంది. మార్కెట్ రెగ్యులేటరీ నియంత్రణ సంస్ద సెబీ ఆదేశాలకు అనుగుణంగా డిపాజిట్ల రూపంలో ఉన్న రూ. 23 కోట్లను బ్యాంకులు ప్రత్యేకంగా సెబీ ఏర్పాటు చేసిన ఖాతాకు బదిలీ చేశాయి. దీనిపై సెబీ అధికారులు మాట్లాడుతూ మ్యూచవల్ ఫండ్‌లలో పెట్టిన రూ. 28 కోట్ల విలువైన పెట్టుబడులు, డీమ్యాట్ ఖాతాలను స్దంభింప చేసింది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications