బెంగుళూరు: దేశంలోని రెండో అతి పెద్ద ఐటీ కంపెనీ ఇన్పోసిస్ మెరుగైన ఫలితాలను ప్రకటించి ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపింది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 2,374 కోట్లుగా ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలానికి రూ. 2,289 కోట్లతో పోలిస్తే సంవత్సర ప్రాతిపదికన 3.7 శాతం లాభం సాధించింది. ఇన్పోసిస్ ఛైర్మన్‌గా నారాయణ మూర్తి రెండో సారి బాధ్యతలను చేపట్టిన తర్వాత మొదటిసారి సారి విడుదల చేసిన ఫలితాలు అంచనాలను చేరుకోగలిగింది. దీంతో ఇన్పోసిస్ షేరు ధర 15 శాతానికి దూసుకెళ్లింది.

ఐతే మార్చి క్వార్టర్‌లో రూ.2,394 కోట్ల లాభంతో పోలిస్తే.. త్రైమాసిక ప్రాతిపదికన ఒక శాతం తగ్గుదల. ఇన్ఫీ కన్సాలిడేటెడ్ ఆదాయం క్యూ1లో రూ.11,267 కోట్లకు పెరిగింది. వార్షికంగా 17 శాతం, త్రైమాసికంగా 8 శాతం చొప్పున వృద్ధి చెందింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2013-14)లో డాలరు రూపంలో ఆదాయ గెడైన్స్‌ను 6-10 శాతంగానే ఎలాంటి మార్పులూ లేకుండా కొనసాగిస్తున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. గెడైన్స్‌ను యథాతథంగా కొనసాగించడం వల్ల ఇన్వెస్టర్లలో కంపెనీపై మళ్లీ విశ్వాసం పుంజుకుంది. ఇది ఇలా ఉంటే దేశీయ ఐటీ పరిశ్రమ ఆదాయ వృద్ధిపై నాస్కామ్ 12-14 శాతం గెడైన్స్ కంటే ఇన్పోసిస్ గెడైన్స్ చాలా తక్కువగా నమోదైంది.

మెరుగైన ఫలితాలను నమోదు చేయడం.. ఆదాయ గెడైన్స్‌లో ఎలాంటి మార్పులు చేయక పోవడంతో నిన్న ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. దీంతో బీఎస్‌ఈలో ఇన్పోసిస్ షేరు ధర క్రితం ముగింపు రూ.2,527తో పోలిస్తే ఒకానొక దశలో 15 శాతం దూసుకెళ్లి... రూ.2,905ను తాకింది.

అనుబంధ సంస్దలతో కలిపి ఇన్పోసిస్ ఈ ఏడాది Q1లో 66 కొత్త క్లయింట్లను దక్కించుకుంది. Q1లో కంపెనీ స్దూలంగా 10,138 మంది ఉద్యోగులను నియమించుకుంది. ఇది ఇలా ఉంటే 9,568 మంది ఉద్యోగులు ఇన్పోసిస్‌ను వీడటంతో మార్చి క్వార్టర్‌లో నికర నియామకాల సంఖ్య కేవలం 575కే పరిమితమైంది. జూన్ నెలాఖరుకల్లా మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,57,263కు చేరింది.

అంతర్జాతీయంగా ఆర్దిక పరిస్దితుల్లో అనిశ్చితి, సవాళ్లు, కరెన్సీ విలువలో హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ.. తొలి త్రైమాసికంలో మంచి పనితీరునే ప్రదర్శించిందని ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ ఎస్‌డీ శిబులాల్ అన్నారు. Q1లో 5-10 కోట్ల డాలర్ల స్థాయిలో ఏడు పెద్ద అవుట్‌సోర్సింగ్ డీల్స్‌ను దక్కించుకున్నామని అన్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications