
వీటిల్లో ముఖ్యంగా జపాన్ బీమా దిగ్గజం నిప్పన్ లైఫ్, సుమిటోమో మిత్సుయి ట్రస్ట్‌తో జత కట్టిన అనిల్ అంబానీ గ్రూప్ సంస్థ రిలయన్స్ క్యాపిటల్ దరఖాస్తు చేసింది. ఆదిత్య బిర్లా నువో, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండియా పోస్ట్, ఐఎఫ్‌సీఐ, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌తో పాటు సూక్ష్మ రుణ సంస్థలైన బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, జనలక్ష్మి ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా బ్యాంకింగ్ బరిలో ఉన్నాయి. కొత్త బ్యాంకింగ్ లెసైన్సుల మార్గదర్శకాలను ఆర్‌బీఐ ఫిబ్రవరి 22న ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ మార్గదర్శకాల ప్రకారం లైసెన్సు పొందిన కొత్త బ్యాంకులు 18 నెలల్లోగా తమ శాఖలను ప్రారంభించాల్సి ఉంది. గతంలో ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు మాట్లాడుతూ అన్ని అర్హతలున్నా, దరఖాస్తు చేసుకున్న ప్రతి సంస్థకు లెసైన్సు ఇచ్చే అవకాశాలు తక్కువని అన్నారు. వచ్చే ఏడాది మార్చ్ నాటికల్లా లెసైన్సులు జారీ అయ్యే అవకాశముందని ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి రాజీవ్ టక్రూ గతంలో తెలిపారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దేశంలో 26 ప్రభుత్వరంగ, 22 ప్రైవేట్ బ్యాంకులు, 56 గ్రామీణ బ్యాంకులు ఉన్నా యి. దేశంలో ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు ఆర్‌బీఐ 1993లో ప్రకటనను జారీ చేసింది.
అప్పట్లో ఐసీఐసీఐ బ్యాంక్ సహా మొత్తం 10 కొత్త బ్యాంకులకు లెసైన్స్‌లు మంజూరయ్యాయి. చివరిసారిగా భారత్‌లో బ్యాంకింగ్ లెసైన్స్‌లు 2001లో జారీ అయ్యాయి. కొటక్ మహీంద్రా బ్యాంక్, యస్ బ్యాంక్(2004లో)లు అప్పుడు వచ్చినవే. అంటే సుమారు మళ్లీ పది సంవత్సరాల తర్వాత ఆర్‌బీఐ బ్యాంకింగ్ లెసైన్స్‌లకు లైన్ క్లియర్ చేసింది.
కొత్త బ్యాంకుల కోసం ఆర్‌బీఐకి దరఖాస్తులు పంపిన సంస్దలు:
1. ఆదిత్య బిర్లా నువో లిమిటెడ్, ముంబై.
2. బజాజ్ ఫిన్సేర్వ్ లిమిటెడ్, పూనే.
3. బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్. లిమిటెడ్, కోలకతా.
4. తపాలా విభాగం, న్యూ ఢిల్లీ.
5. ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ముంబై.
6. IDFC లిమిటెడ్, ముంబై.
7. IFCI లిమిటెడ్, న్యూఢిల్లీ.
8. ఇండియాబుల్ల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, న్యూఢిల్లీ.
9. ఇండియా ఇన్పోలైన్ లిమిటెడ్, ముంబై.
10. INMACS మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్, గుర్గావ్.
11. జయలక్ష్మీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్. లిమిటెడ్, బెంగుళూర్.
12. J M ఫైనాన్షియల్ లిమిటెడ్, ముంబై.
13. LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ముంబై.
14. L & T ఫైనాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్, ముంబై.
15. మాగ్నా ఫిన్ కార్ప్ లిమిటెడ్, కోలకతా.
16. ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, కొచీ.
17. రిలయన్స్ కాపిటల్ లిమిటెడ్, ముంబై.
18. రిలిగేర్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, న్యూఢిల్లీ.
19. శ్రీరామ్ కాపిటల్ లిమిటెడ్, చెన్నై.
20 స్మార్ట్ గ్లోబల్ వెంచర్స్ ప్రైవేట్. లిమిటెడ్, నోయిడా.
21. SREI ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్, కోలకతా.
22. సూర్యమాని ఫైనాన్సింగ్ కంపెనీ లిమిటెడ్, కోలకతా.
23. టాటా సన్స్ లిమిటెడ్, ముంబై.
24. భారతదేశం లిమిటెడ్ పర్యాటక ఫైనాన్స్ కార్పొరేషన్, న్యూఢిల్లీ.
25. UAE ఎక్స్చేంజ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, కొచీ.
26. వాల్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఔరంగాబాద్.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications