
ఈ మాదిరి ఆదేశాలను బ్యాంకులు, నాన్ - బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ఆర్‌బీఐ గత నెల్లో జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి కారణం కరెంట్ అకౌంట్ లోటు పెరిగిపోవడమే. అంతేకాకుండా బంగారం దిగుమతులను తగ్గించే భాగంగా కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది. బంగారం ధరలు గత కొన్ని రోజులుగా క్షీణిస్తున్నాయి. విదేశాలతో పోలిస్తే దేశీయ గోల్డ్ ఈటీఎఫ్ పరిశ్రమ చిన్నదే అయినా గత రెండు నెలల నుంచి ఎక్కువ సంఖ్యలో ఇన్వెస్టర్లు వైదొలుగుతున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. గతంలో దేశీయ గోల్డ్ ఈటీఎఫ్‌లు గరిష్టంగా 36 టన్నుల బంగారాన్ని కలిగి ఉంటే అది ఇప్పుడు 33 టన్నులకు తగ్గినట్లు గోల్డ్‌మన్ శాచ్ మ్యూచువల్ ఫండ్ సంస్థ పేర్కొంది.
గత రెండు నెలల్లో సుమారు 7 శాతానికిపైగా బంగారాన్ని అమ్మినట్లు ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ సేల్స్ హెడ్ శరత్ శర్మ తెలిపారు. కొత్తగా ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఎవ్వరూ అంతగా ఆసక్తి చూపించడం లేదన్నారు. వరుసగా 12 సంవత్సరాలపాటు లాభాలు అందించిన బంగారం ఈసారి భారీగా నష్టపోతుండటమే దీనికి కారణం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 25 శాతానికిపైగా క్షీణించడం.. రూపాయి విలువ క్షీణత, బంగారంపై దిగుమతి పన్నుని పెంచడంతో దేశీయంగా కేవలం 15% మాత్రమే క్షీణించాయి. మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం గడిచిన ఐదు నెలల్లో 14 మ్యూచువల్ ఫండ్ సంస్థలు నిర్వహిస్తున్న బంగారం ఆస్తుల విలువ రూ.12,057 కోట్ల నుంచి రూ.10,580 కోట్లకు పడిపోయింది.
కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పెరిగిపోతుందని.. ఈ సమస్యను ఎదుర్కొనడానికి ప్రజలు దీనిపై మోజును తగ్గించుకోవాలని స్వయంగా దేశ ఆర్దిక మంత్రి పి. చిదంబరం విజ్ఞప్తి చేసిన నేపధ్యంలో పసిడి అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు రిలయన్స్ క్యాపిటల్ పేర్కొంది. బంగారు అమ్మకాలను నిలిపివేయడంసహా, బంగారం తనఖాగా ఫైనాన్షింగ్‌ను సైతం సంస్థ సస్పెండ్ చేయనున్నామని అన్నారు. రిలయన్స్ గోల్డ్ సేవింగ్స్ ఫండ్‌లో కొత్త చందాదారులను చేర్పించడాన్ని కూడా నిలిపివేయాలని రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.



Click it and Unblock the Notifications