టెక్ మహీంద్రా, మహీంద్రా సత్యం విలీన ప్రణాళిక పరిపూర్ణం

ప్రస్తుతం ఈ సంస్ద సీఎఫ్ఓగా మిలింద్ కులకర్ణి బాధ్యతలను నిర్వహిస్తారని వినీత్ నయ్యర్ తెలిపారు. ముంబై ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న టెక్ మహీంద్రాకి ప్రపంచ వ్యాప్తంగా 84 వేల సిబ్బంది.. 46 దేశాల్లో 540 మంది క్లయింట్లు ఉన్నారు. ఈ రెండు సంస్థలు కలిపి కొత్త సంస్థ ఏ విధంగా ఉంటుంది, కీలకమైన మేనేజరియల్ పదవులు ఎవరు చేపట్టనున్నారన్నది త్వరలో ప్రకటించనున్నారు. కొత్త సంస్థకు చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా పేరును సూచించవచ్చని తెలుస్తోంది.
మహీంద్రా సత్యంలో భాగంగా ఉన్న వెంచర్‌బే కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సత్యం కంప్యూటర్ సర్వీసెస్ లిమిటెడ్, సీఅండ్‌ఎస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, కాన్వాస్‌ఎం టెక్నాలజీస్ లిమిటెడ్, మహీంద్రా లాజిసాఫ్ట్ బిజినెస్ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీలకు, టెక్ మహీంద్రా లిమిటెడ్‌కు మధ్య విలీనానికి సంబంధించి జరిగిన ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆమోద ముద్ర వేసింది. ప్రజా ప్రయోజనాలు, వాటాదారులు, ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోని ఈ విలీనానికి ఆమోదం తెలుపుతున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. పైన పేర్కొన్న కంపెనీల మధ్య జరిగిన విలీనం విచారణకు ఏ విధమైన ఆటంకం కాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ విలీనాన్ని సవాలు చేస్తూ రుణదాతలు, వాటాదారులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.
వన్ఇండియా మనీ తెలుగు


Click it and Unblock the Notifications