న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న పరిణామాలకు అనుగుణంగా దేశ వ్యాప్తంగా మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఏరోజుకి ఆరోజు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నాయి. ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర మళ్లీ 27వేల లోపునకు పడిపోయింది. ఎమ్‌సీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర ఎన్నడూ లేని విధంగా 1.31 శాతం తగ్గి రూ. 26,666 వద్ద ట్రేడ్ అయింది. ట్రేడింగ్ మొదలుకోని మద్యాన్నం 11.26 గంటల వరకూ రూ. 26,666 వద్దనే ట్రేడ్ అవడం గమనార్హం. ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయాలు చైనాపై కూడా కాస్తంత ప్రభావాన్ని చూపాయి.
సోమవారం బంగారం ధరలు చాలా వరకు రూ. 27,000కి లోపే ట్రేడ్ అయ్యాయి. 24 క్యారెట్ల బంగారం ధర శనివారంతో పోల్చితే రూ.340 తగ్గి రూ.26,950కి చేరితే, 22 క్యారెట్లకు సంబంధించి ఈ ధర రూ.300 తగ్గి, రూ.26,840కి పడింది. వెండి కేజీకి ఒకేరోజు రూ. 780 పడి రూ.42,220కి దిగింది. ఇక ఢిల్లీ విషయానికి వస్తే, రెండు రకాల ధరలు రూ. 320 చొప్పున తగ్గి, వరుసగా రూ.27,320, రూ. 27,120కి పడ్డాయి. వెండి ధర సైతం రూ.800 తగ్గి రూ.41,500గా ఉంది.
ఇక అంతర్జాతీయ మార్కెట్ల నెమైక్స్‌లో బంగారం ధరలు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. రూపాయి మారకపు విలువ పతనమవ్వడం.. కరెంట్ లోటు తగ్గించుకునేందుకు బంగారం కొనుగోళ్లు నుండి చాలా వరకు వినియోగదారులు సైతం దూరంగా ఉంటున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
వన్ఇండియా మనీ తెలుగు
Share This Article
English summary
తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బంగారం.. మళ్లీ రూ. 27 వేల కిందకు | Gold falls by 1.31% on strong dollar, weak demand outlook | తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బంగారం.. మళ్లీ రూ. 27 వేల కిందకు
Gold prices fell by 1.31 per cent on Monday at the domestic markets as stronger greenback makes the yellow metal cheaper for those holding other currencies, thus reducing demand.
Story first published: Tuesday, June 25, 2013, 12:51 [IST]
Other articles published on
Jun 25, 2013