సహారాకు చెందిన రూ. 52 కోట్లు, 450 ఎకరాలను స్వాధీనం చేసుకున్న సెబీ

జప్తు ఆదేశాల్లో భాగంగా సహారా కంపెనీలు, వ్యక్తులకు చెందిన ఆస్తుల్లో లావాదేవీలు అనుమితించ వద్దని ఆ జిల్లా కలెక్టర్లను సెబీ కోరింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సహారాకు సంబంధించిన 450 ఎకరాలు ఉన్నట్లు సెబీ ఆయా జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు సమాచారం పంపారని సెబీ వర్గాలు తెలిపాయి. సహారా గ్రూపునకు చెందిన సహారా హౌసింగ్ కార్పోరేషన్, సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పోరేషన్‌లు బాండ్ల ద్వారా నిబంధనలకు విరుద్దంగా దాదాపు 3 కోట్ల మంది మదుపర్ల నుండి రూ. 24,000 కోట్లను వసూలు చేసింది. ఈ విషయం తెలుసుకున్న భారత అత్యున్నత న్యాయస్దానం వాటిని తిరిగి చెల్లించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
మదుపరులకు డబ్బులు తిరిగి చెల్లించడానికి జప్తు చేసిన ఆస్తులను విక్రయించే వ్వవహారం పర్యవేక్షణకు అధికారులను నియమించుకొనేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీం కోర్టుని ఇప్పటికే సెబీ కోరింది. ఐతే మదుపర్లకు చెల్లించడానికి ఇప్పటి వరకూ సహారాగ్రూప్ సెబీకి రూ. 5,120 కోట్లు ఇచ్చింది. మేము ఇప్పటికే రూ. 20,000 కోట్లు చెల్లించామని.. మిగిలిన వారికి చెల్లించడానికి ఈ మొత్తం సరిపోతుందని సహారా గ్రూప్ పేర్కొంది. మదుపర్లకు సంబంధించి సహారా గ్రూప్ సమర్పించిన పత్రాల్లో 99 శాతం మంది చిరునామాలను సెబీ కనుగొనలేకపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సెబీకి బాండ్ల ద్వారా అందించిన నగదుని తీసుకునేందుకు తగిన పత్రాలు సమర్పించాలని 21,000 మంది బాండ్ హోల్డర్లకు సెబీ నోటీసులు పంపింది.
ఈ రిఫండ్‌లకు సంబంధించి దరఖాస్తుదారులు కావల్సిన డాక్యుమెంట్లు, అవసరం లేని కాగితాలు ఎక్కువ మొత్తంలో సెబీకి వచ్చాయి. రిఫండ్ కోరుతున్న ఇన్వెస్టర్ల చిరునామా రుజువు, బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు క్లెయిమ్ దరఖాస్తుల్లో చాలావరకూ పాన్ నంబర్లు కూడా ఉండటం లేదని సమాచారం. న్యాయమైన పెట్టుబడిదారులకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలలో నగదు జమచేయాలని మార్కెట్ రెగ్యులేటరీ సంస్ద సెబీ భావించింది. కానీ అందుకు వీలుగా బ్యాంక్ ఖాతాల వివరాలను కొంత మంది దరఖాస్తుదారులు పొందుపరచక పోవడంతో సెబీకి ఈ వ్యవహారం పెద్ద తలకాయ నొప్పిగా మారింది.
వన్ఇండియా మనీ తెలుగు


Click it and Unblock the Notifications