ముంబై: భారత దేశ ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ ఆర్దిక సంవత్సరంలో 10,000 వేల ఉద్యోగాలు ఇవ్వనుంది. గత క్వార్టర్లో 20,000 వేల మందిని ఆసిస్టెంట్ గ్రేడ్ ఉద్యోగులను నిమమించామని అన్నారు. ఈ ఏడాది సుమారు 7,500 మంది ఎస్బీఐ ఉద్యోగులు రిటైర్ అవుతున్నారని అన్నారు. ఈ ఏడాది కొత్తంగా 1,500 ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయని ఎస్బీఐ ఛైర్మన్ ప్రతీప్ చౌధురి చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా 1,200 బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నామని, చైనా, ఇంగ్లాండ్‌లతో పాటు ఇతర దేశాల్లో ఎనిమిది బ్రాంచీ ఆఫీసులను తెరవనున్నామని ఆయన అన్నారు. ఇది ఇలా ఉంటే గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 63,000 మందికి కొలువులిచ్చాయి. ఎస్బీఐ 20 వేల క్లర్క్‌లను, 1,200 ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలివ్వగా, ఇతర పీఎస్‌యూ బ్యాంకులు 22,000 వేల మంది ఆఫీసర్, 20,000 వేల క్లర్క్ ఉద్యోగాలనిచ్చాయి.
వన్ఇండియా మనీ తెలుగు
Share This Article
English summary
ఈ ఏడాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో 10 వేల ఉద్యోగాలు | SBI to hire 10,000 officers, employees in current fiscal | ఈ ఏడాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో 10 వేల ఉద్యోగాలు
State Bank of India plans to hire 10,000 officers and employees in the current fiscal to spruce up its operations.
Story first published: Monday, June 24, 2013, 14:45 [IST]
Other articles published on
Jun 24, 2013