రూపాయి పతనం: చేయి దాటిపోలేదన్న ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి

Rupee
న్యూఢిల్లీ: రూపాయి మారకపు విలువ నానాటికీ దిగజారిపోవడంతో స్టాక్‌ మార్కెట్‌ ఒక్కసారిగా పతనమవుతున్నాయి. డాలర్‌ మారకంతో రూపాయి క్షీణించడంతో దాని ప్రభావం స్టాక్‌ మార్కెట్‌ పడింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ క్యూ4 నాటికి పూర్తిస్థాయిలో పుంజుకుంటుందని.. ఉద్దీపన పథకాలను దశలవారీ గా ఎత్తివేయడం జరుగుతుందని 2014 క్యూ3 నాటికి పూర్తి స్థాయిలో ఎత్తివేస్తామని రెబో బ్యాంకు మార్కెట్‌ రీసెర్చి తన ప్రకటనలో రూపాయి భారీగా పతనం కావడంతో రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గించే విషయం వాయిదా వేసుకుంటుంది.

రూపాయి మారకపు విలువ తగ్గినప్పటికీ.. మన చేయి దాటి పోలేదని పరిస్దితులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), ప్రభుత్వం, సెబీ గమిస్తున్నాయని ఆర్దిక శాఖ ముఖ్య సలహాదారు రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ఈ సందర్బంలో రాజన్ మాట్లాడుతూ రూపాయి మారకపు విలువ దారుణంగా పడిపోతే చర్యలు తీసుకోవడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు. రూపాయి క్షీణతను అడ్డుకోవడానికి తగినన్ని ఉపాయాలు మా దగ్గర ఉన్నాయి. అవసరమైనప్పుడు వాటిని ఉపయోగిస్తాం. ఒక్క రూపాయి విలువే పడిపోవడం లేదు. వర్దమాన దేశాలకు చెందిన కరెన్సీ విలువ కూడా తగ్గుతుందన్నారు.

కాబట్టి కొన్ని రోజుల్లో అన్ని సర్దుకోని రూపాయి స్దిరపడుతుందన్నారు. ఫారెక్స్ మార్కెట్‌లో అర్‌బీఐ జోక్యంపై అప్పుడే ఏమీ మాట్లాడను. అమెరికా ఫెడ్ క్రమంగానే బాండ్ల కొనుగోలును తగ్గిస్తుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ గాడిన పడు తున్నందున ఫెడ్‌ రిజర్వు చైర్మన్‌ బెన్‌ బెర్నాంకి ఉద్దీపన పథాకాలకు రాంరాం చెబుతామని ప్రకటించడంతో మార్కె ట్‌లు కుప్పకూలిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికిప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాబోయే కాలంలో భారత ఆర్దిక వ్యవస్ద భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని.. ఈ ప్రభావం ద్రవ్యోల్బణంపై ఉంటుందని అన్నారు.

ఇక బంగారం విషయానికి వస్తే బంగారం కట్టడికి మరిన్ని చర్యలు ఉండవని స్పష్టం చేశారు. బంగారం దిగుమతులపై ఒక్కసారిగా అన్ని నిబంధనలు, నిషేధాలు విధిస్తే అది మన ఆర్దిక వ్యవస్దను ఇబ్బందికి గురి చేస్తుంది. బంగారం దిగుమతులను తగ్గించడానికి 2012 నుండి ఇప్పటి వరకూ బంగారంపై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం మూడు సార్లు పెంచింది. ఇటీవల కాలంలో బంగారంపై సుంకాన్ని 2 శాతం పెంచి 8 శాతానికి సవరించింది. దీనితోపాటు బ్యాంకులు దిగుమతి చేసుకుంటున్న బంగారంపై కూడా ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీనికి కారణం కరెంట్ ఎకౌంట్ లోట్ పెరగడమే.

వన్ఇండియా మనీ తెలుగు

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+