
ఐగేట్‌తో పాటు ఆ సంస్ద అధికారులు కొందరిపై నార్తర్న్ డిస్ట్రిక్ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన జిల్లా న్యాయస్దానంలో ఈ నెల 14న క్లాస్ యాక్షన్ సూటు దాఖలు చేశారు. ప్రతివాదులు తన వ్యాపారం, కార్యకలాపాలు, ఇతర ఆచరణ విధానాల విషయంలో తప్పుదారి పట్టించే, పచ్చి అబద్దపు ప్రకటనలను జారీ చేసినట్లు ఫిర్యాదుదారు ఆరోపించారని న్యాయసంస్ద పేర్కొంది.
పిటిషన్‌లోని ముఖ్యాంశాలు:
ఫణీశ్ మూర్తి క్రింది స్దాయి మహిళా ఉద్యోగితో అనుచిత సంబంధం కలిగి ఉన్న విషయాన్ని వెల్లడించలేదు. కంపెనీ స్పష్టంగా పెట్టుకున్న విధానాలకు వ్యతిరేకంగా ఫణీశ్ మూర్తి ప్రవర్తించారు. మూర్తి అనుచిత ప్రవర్తిన ఆయనను కంపెనీలో నుండి తప్పిస్తారనే రిస్కుకు కారణమైంది. ఇత కంపెనీ విజయావకాశాలకు భంగం కలిగించింది. ఫెడరల్ సెక్యూరిటీ చట్టాలను అతిక్రమించినందుకు ఐగేట్, ఐగేట్ అధికారులు, డైరెక్టర్ల నుండి పరిహారం ఇప్పించాలి.
ఇది ఇలా ఉంటే ఈ విషయంపై స్పందించిన ఐగేట్ ప్రతినిధి.. ఈ వాదనలో పస లేదని నమ్ముతున్నామని పేర్కొన్నారు. ఐగేట్ కంపెనీలో ఛీప్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న ఫనీష్ మూర్తి తన క్రింది ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురి చేస్తుండటంతో అతనిని కంపెనీ బోర్డు డైరెక్టర్లు విధుల నుండి తప్పించిన విషయం తెలిసిందే.
కంపెనీ పాలసీలను అతిక్రమించడం వల్ల కంపెనీ నుండి దక్కాల్సిన 15.09 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 84 కోట్ల) ప్రయోజనాలను కోల్పోనున్నారు. కంపెనీ నుండి మంచి గుడ్ విల్‌తో గనుక వైదోలిగినట్లైతే తనకు దక్కాల్సిన ప్రయోజనాలు సక్రమంగా అందేవి. కానీ ఇలా తోటి ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడి కంపెనీ నిబంధలను అతిక్రమించడం వల్ల ఈ ప్రయోజనాలు దక్కవని అంటున్నారు. కానీ వృత్తిపరంగా అనుచితంగా వ్యవహరించినందుకువాటిని కోల్పోవాల్సి వస్తోంది. ఐతే ఫనీష్ మూర్తి, ఆయన భార్యకి 65 ఏళ్లు వచ్చేవరకు నెలకు 6,000 డాలర్లు చొప్పున కంపెనీ చెల్లిస్తుంది. అలాగే, విధుల నుండి తప్పించినందుకు గాను 12 నెలల వేతనం అంటే 10,00,000 డాలర్లు పరిహారం కింద ఐగేట్ కార్పోరేషన్ చెల్లించనుంది.
వన్ఇండియా మనీ తెలుగు


Click it and Unblock the Notifications