
ఆంధ్రా బ్యాంక్ నుండి 2011 నవంబర్ 18న డీసీహెచ్‌ఎల్ యాజమాన్యం రూ. 200 కోట్లు రుణం తీసుకుంది. ఈ రుణం వసూలు నిమిత్తం బ్యాంకు ఇప్పటికే రుణ వసూళ్ల ట్రైబ్యునల్‌కు ఆశ్రయించడంతో.. డీసీహెచ్‌ఎల్ బ్యాంకుకు తనఖా పెట్టిన ఆస్తులపై ఇతరులకు హక్కు కల్పించరాదని డీఆర్‌టీ ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జారీ చేసిన ఆస్తుల్లో తమిళనాడులోని 4.5 ఎకరాలు, కర్ణాటకలోని రాజపుర గ్రామంలోని 15279 చదరపు మీటర్ల స్దలాలు ఉన్నాయి. వీటితో పాటు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, రాజమండ్రి, విశాఖపట్నం, కర్నూలు, కడప లాంటి ప్రాంతాల్లో డీసీహెచ్ఎల్‌కు ఉన్న ఆస్తుల జాబితాను ట్రైబ్యునల్‌కు బ్యాంకు సమర్పించి అటాచ్ చేయాలని కోరడం జరిగింది.
ఇటీవలే డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) ఛైర్మన్ టి. వెంకట్రామిరెడ్డి, వైస్ ఛైర్మన్ టి. వినాయక్ రవిరెడ్డిలకు సంబంధించిన వ్యక్తిగత ఆస్తులతో పాటు డీసీహెచ్ఎల్‌కు చెందిన రెండు ఆస్తులను డెట్ రికవరీ ట్రిబ్యునల్ అటాచ్ చేస్తున్నట్లు న్యాయమూర్తి కె. సాయి మోహన్ తన ఉత్తర్వులను జారీ చేశారు. యాక్సిస్ బ్యాంక్ దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఆదేశాల మేరకు వీరిద్దరి ఆస్తులను అటాచ్ చేశారు. తమకు చెల్లించాల్సిన రుణం మొత్తం రూ. 427 కోట్లు చెల్లించడం లేదంటూ యాక్సిస్ బ్యాంక్ తన పిటిషన్‌లో పేర్కొంది.
దీంతో న్యాయమూర్తి యాక్సిస్ బ్యాంక్‌కు చెల్లించాల్సిన రుణాన్ని ఎందుకు చెల్లించలేదన్న దానిపై డీసీహెచ్ఎల్ సరైన వివరణ డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ సరైన వివరణ ఇవ్వలేదని, అలాగే రుణానికి సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్‌ను చెల్లించడంలో కూడా డీసీహెచ్‌ఎల్ విఫలమైందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే అటాచ్‌మెంట్ కోరుతూ యాక్సిస్ బ్యాంకు దాఖలు చేసిన పిటిషన్‌పై కనీసం కౌంటర్ కూడా డీసీహెచ్‌ఎల్ దాఖలు చేయలేదని, ఈ నేపథ్యంలోనే ఆస్తులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు పేర్కొన్నారు.
అటాచ్ చేసిన ఆస్తుల్లో వెంకట్‌రామిరెడ్డికి చెందిన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని పెంటగాన్ ఎక్స్‌టెన్షన్‌లోని ఫ్లాట్ నెంబర్ 9 (ఇంటి నెంబర్ 8-2-703), ఇదే రోడ్డులోని 1050 గజాల ఇంటి స్థలం, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 37లోని వినాయక్‌రెడ్డికి చెందిన 1570 గజాల ఇంటి స్థలం, డీసీహెచ్‌ఎల్ పేరుతో పటాన్‌చెరువు సమీపంలోని కొల్లూరులో ఉన్న ఏడు ఎకరాల భూమి, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని 1066 గజాల ఇంటి స్థలం ఉన్నాయి. డీసీహెచ్‌ఎల్ ఆస్తులను అటాచ్‌చేస్తూ డీఆర్‌టీ జారీచేసిన ఉత్తర్వులను ఆయా ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్‌లకు యాక్సిస్ బ్యాంకు అందించనుంది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications