వడ్డీరేట్లను తగ్గించని ఆరబీఐ గవర్నర్ దువ్వూరి, నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Duvvuri Subbarao
ముంబై: భారతీయ అతి పెద్ద బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు ప్రకటించిన మానిటరీ పాలసీలో వడ్డీరేట్లను తగ్గించకుండా మార్కెట్ వర్గాలను నిరాశపర్చింది. వడ్డీ రేట్లతో పాటు నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ను కూడా యదాతథంగా ఉంచింది. హోల్‌సేల్‌ ప్రైస్‌ ఇండెక్స్‌-డబ్ల్యూపీఐ మే నెలలో 4.7 శాతానికి దిగి వచ్చినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు మాత్రం వడ్డీ రేట్లను తగ్గించక పోవడం గమనార్హం. ఇటీవల కాలంలో రూపాయి మారకపు విలువ బాగా తగ్గడంతో పెట్లోల్ తో పాటు ఇతర దిగుమతి వస్తువుల ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే.

దీంతో రాబోయే కాలంలో ద్రవ్యోల్బణం మరింతగా పెరుగుతుందనే అవకాశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ప్రస్తుతం రెపోరేటు 7.25శాతంగా ఉంది. ఇక నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్) 4 శాతంగా ఉంది. ఐతే ధరలు పెరగకపోతే జులై నెల సమీక్ష సమావేశంలో వడ్డీ రేట్లు తగ్గించవచ్చునని భావిస్తున్నారు. ఈరోజు మానిటరీ పాలసీలో వడ్డీరేట్లను తగ్గించకపోవడంతో మార్కెట్లు ఒక్కసారిగా నష్టల్లో ట్రేడ్ అవుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో సెన్సెక్స్‌ 80 పాయింట్ల దాకా కోల్పోతూ 19,100 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోతూ 5,775కి సమీపంలో ట్రేడ్ అవుతుంది.

వన్ఇండియా మనీ తెలుగు

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+