
రూ. 80 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ప్రారంభమవుతున్న ఈ జేవీలో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌ఏషియా 49 శాతం, టాటాసన్స్ 30 శాతం, టెలిస్ట్రా ట్రేడ్‌ప్లేస్ 21 శాతం పెట్టుబడులు పెట్టి కొత్త ఎయిర్‌లైన్‌ను ప్రారంభిస్తాయని ఎయిర్ ఏషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. మలేషియా కంపెనీ తొలివిడతలో 3 నుండి 5 కోట్ల డాలర్ల పెట్టుబడులు తీసుకురానుంది. ఎయిర్ ఏషియా ప్రాథమిక పెట్టుబడిగా సుమారు రూ. 275 కోట్లు వెచ్చించనుంది. ఈ ఎయిర్‌లైన్స్ తక్కువ చార్జీల విధానాన్నే కస్టమర్స్‌కు అందిస్తుంది. మొదటగా 3-4 ఎయిర్‌బస్ ఏ-320 విమానాలతో సర్వీసులను ప్రారంభించి ఆతర్వాత వీటి సంఖ్యను వేగంగా పెంచుతామన్నారు. చెన్నై ప్రధాన కేంద్రంగా ఈ ఎయిర్‌లైన్స్ నడవనుందని ఎయిర్ ఏషియా చీఫ్ ఎగ్జిక్యూటివ్(సీఈఓ) టోనీ ఫెర్నాండెజ్ తెలిపారు. భారత్‌లో ఎయిర్‌ఏషియా జెట్ ఎయిర్‌వేస్, స్పయిస్‌జెట్, ఇండిగో, గో ఎయిర్‌తో పాటు ఎయిర్ ఇండియాతో పోటీపడతాయి.
ఇటీవలే ఎయిర్ ఏషియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా చెన్నైకు చెందిన 33 ఏళ్ల మిత్తు చాండిల్య నియమితులయ్యారు. చెన్నైలో జన్మించి, సింగపూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ అయిన చాండిల్య ఎయిర్ ఏషియా సీఈవోగా వచ్చే నెల 1 నుంచి బాధ్యతలు స్వీకరిస్తారని ఎయిర్ ఏషియా తెలిపింది. ఈ సందర్బంలో మిత్తు చాండిల్య మాట్లాడుతూ తాను చెన్నై వాసినని... భారత్‌కు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. భారత విమానయాన రంగంలో సరికొత్త అధ్యయనానికి నాంది పలకనున్న ఎయిర్ ఏషియాలో భాగమైనందుకు ఆనందంగా ఉందని అన్నాడు. ఎయిర్ ఏషియాను చాండిల్య విజయవంతమైన సంస్థగా నిర్వహించగలరన్న ధీమాను టాటా గ్రూప్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా వ్యక్తం చేశారు.
తెలుగు వన్ఇండియా మనీ
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications