
2003 నుండి గమనించినట్లైతే భారత్ స్దూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ది రేటు అత్యంత తక్కువగా 2012-13వ ఆర్దిక సంవత్సరంలో 5 శాతంగా నమోదైంది. ఈ ఏడాది ప్రపంచ వృద్ధి రేటు 2.2 శాతంగా ఉంటుందని, 2015లో 3.3 శాతానికి చేరుకోగలదని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఆర్దిక పరంగా బలంగా ఉన్న దేశాల్లో రిస్క్‌లు తగ్గి.. వృద్ది రేటు మెరుగుపడుతున్నప్పటికీ, అభివృద్ది చెందుతున్న దేశాల్లో మాత్రం కొన్ని కారణాల వల్ల వృద్ది రేటు ఒక మోస్తరుగా ఉండబోతుందని జీఈపీలో పేర్కొంది. ఈ సందర్బంలో ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకానమిస్టు కౌశిక్ బసు మాట్లాడుతూ భారత్, బ్రెజిల్ తదితర దేశాల్లో సరఫరా లాంటి సమస్యలున్నాయని అన్నారు. అంతేకాకుండా ఈ సరఫరా సంస్కరణలు పూర్తిగా అమలు చేస్తే తప్ప ఈ దేశాలు సంక్షోభం నుండి పూర్తిగా వృద్ది సాధించలేవని అన్నారు.
వీటితో పాటు ఎగుమతులు, ప్రైవేట్ పెట్టుబడులు ఇందుకు ఊతం ఇవ్వగలవని ‘ప్రపంచ ఆర్థిక వృద్ధి అవకాశాల (జీఈపీ)' నివేదికలో ప్రపంచ బ్యాంకు వివరించింది. దక్షిణాసియా ప్రాంత అభివృద్ధిలో భారత్ కీలకపాత్ర పోషించనుందని పేర్కొంది. రికవరీ ఎంత భారీగా ఉంటుందో... పాలసీపరమైన, ఆర్థిక పరమైన సంస్కరణలపైన ఆధారపడి ఉంటుందని వివరించింది. ప్రస్తుతం భారత్ కరెంటు అకౌంటు లోటును కట్టడి చేసుకునేందుకు ఎక్కువగా విదేశీ పెట్టుబడులపై ఆధారపడుతుండటం వల్ల, ఒకవేళ ఇన్వెస్టర్ల సెంటిమెంటు ప్రతికూలంగా మారితే సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications