న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో రూపాయ మారకపు విలువ అత్యంత వేగంగా కరిగిపోతుంది. రిజర్వ్ బ్యాంక్ మాత్రం పైకి గంభీరంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. పరిస్దితులు ఇప్పుడిప్పుడే చక్కపడే అవకాశాలేమీ కనిపించడం లేదు. మనం దిగుమతి చేసుకునే వాటి రేట్లు అంతర్జాతీయ మార్కెట్లో అదే స్దాయిలో ఉన్నప్పటికీ.. రూపాయి పతనం కావడంతో ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మే ప్రారంభం నుండి ఇప్పటిదాకా 8.5 శాతం పైనే క్షీణించింది. మేలో 53 స్థాయిలో ఉంటే ప్రస్తుతం 58.39 వద్ద ఉంది. అంటే నెల రోజుల వ్యవధిలో సుమారు 500 పైసల పైగా పతనమైంది. దీని ప్రభావం సామాన్య మానవులపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో చూద్దాం.

భారత్ దిగుమతుల బిల్లు ప్రతి సంవత్సరం 450 బిలియన్ డాలర్ల పైమాటే. రూపాయి క్షీణంచడం వల్ల ఈ బిల్లూ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే.. పెట్రోల్ రేటు లీటరుకు రూ. 2 మేర పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో పెరిగే అవకాశముందని చమురు కంపెనీలు చెబుతున్నాయి.

కీలకమైన ఉత్పత్తులు, ముడి సరుకులు కోసం భారత్ ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ముడి చమురు, బంగారం, ఎరువులు మొదలైన వాటన్నింటినీ దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇందులో అత్యధిక వాటా ముడిచమురుదే. ఫలితంగా వంట నూనెల నుంచి పెట్రోల్ దాకా అన్నీ భారం అవుతాయి.

రూపాయి పతనంతో అత్యధికంగా విద్యుత్, సిమెంట్, టెలికం రంగ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడనుంది. కొనాళ్ల క్రితం విదేశీ రుణాలు చాలా చౌకగా దొరుకుతుండటంతో చాలా దేశీ కంపెనీలు చక చకా అప్పులు తెచ్చుకున్నాయి. ఇప్పుడు రూపాయి క్షీణంచండం వల్ల కట్టాల్సిన వడ్డీ పెరగడమే కాకుండా అసలు మొత్తం కూడా పెరిగిపోయిం

అంతర్జాతీయంగా పసిడి తగ్గుతున్నా.. రూపాయి పతనం వల్ల దేశీయంగా ఆ స్థాయిలో తగ్గడం లేదు. గడిచిన పక్షం రోజుల్లో అంతర్జాతీయంగా బంగారం ధరలు 2.94 శాతం దాకా పడగా.. దేశీయంగా మాత్రం 3.14 శాతం పెరిగాయి.

రూపాయి పతనంలో ధరలు పెరిగే వస్తువుల జాబితాలో ప్రధానంగా ఎలక్ట్రానిక్స్‌తోపాటు రంగులు(పెయింట్స్), వాహనాలు, పురుగు మందులు, కాఫీ, చాకొలేట్లు, ప్లాటినం, బొగ్గు, ఐరన్, సోలార్ సెల్స్, సోలార్ ఉత్పత్తులు, ఎల్‌ఈడీ లైట్లు, స్టెంట్లు, ఇతర వైద్య పరికరాలు, బొమ్మలు, టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..



Click it and Unblock the Notifications