ఉద్యోగులు నిరాహార దీక్ష.. జీతాలిచ్చేందుకు డబ్బుల్లేవ్: విజయ్ మాల్యా

మీ వేతన బకాయిలు చెల్లించడానికి నా దగ్గర డబ్బు లేదు. యునెటైడ్ స్పిరిట్స్-డయాజియో డీల్ ద్వారా వచ్చిన నిధులను కర్ణాటక హైకోర్టు ఇంజంక్షన్ కారణంగా ఇతర అవసరాలకు ఉపయోగించలేనని ఉద్యోగులతో ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. గతేడాది ఆగస్టు నుంచి కంపెనీ జీతాలు చెల్లించకపోతుండటంతో ఉద్యోగులు కింగ్‌ఫిషర్ హౌస్ దగ్గర గురువారం నుంచి నిరాహారదీక్షకు దిగిన విషయం తెలిసిందే. కింగ్ ఫిషర్ తీసుకున్న రుణాలు, నష్టాలు దాదాపు రూ. 15,000 కోట్ల మేర పేరుకుపోవడంతో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు నిలిచిపోయాయి.
కింగ్ ఫిషర్ సంస్థ సీఈవో సంజయ్ అగర్వాల్ చర్చలు జరుపుతారని మాల్యా చెప్పినప్పటికీ ఉద్యోగులు నిరాహార దీక్ష మానుకోలేదు. స్వయంగా మాల్యాతోనే గతంలో అనేక సార్లు సమావేశమైనా.. ఉపయోగం లేకుండా పోయిందని, తమ డిమాండ్లు పరిష్కరించే దాకా నిరాహార దీక్ష కొనసాగిస్తామని చెప్పారు. సంజయ్ అగర్వాల్‌తో రెండో విడత చర్చలు జరిపిన తర్వాత ఉద్యోగులు దీక్షను విరమించేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం రూ. 7000 కోట్లకుపైగా అప్పులు ఉన్నాయి. గతేడాది అక్టోబర్ 1న కంపెనీ ప్లయింగ్ లెసైన్స్‌ను కేంద్రం సస్పెండ్ చేయగా.. డిసెంబర్ 31తో లెసైన్స్ గడువు కూడా ముగిసింది. రుణ సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఇచ్చిన రుణాలను వసూలు చేసేందుకు గాను నాలుగు ప్రధాన బ్యాంకులు కలిసి ఒక సబ్ గ్రూప్‌గా ఏర్పడ్డాయి. గతంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో 17 బ్యాంకులు కింగ్‌ఫిషర్‌కు రూ.7,500 కోట్ల పైగా రుణాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కంపెనీకి రుణాలిచ్చిన 17 బ్యాంకుల కన్సార్షియంలో భాగస్వామ్యులైన కీలక బ్యాంకుల నుంచి ఈ సబ్‌గ్రూప్ ఏర్పాటైంది. ఈ సబ్‌గ్రూప్‌లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), పీఎన్‌బీ, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి.
వన్ఇండియా మనీ తెలుగు


Click it and Unblock the Notifications