టీసీఎస్ సీఈఓ నెల వేతనం రూ. 10 లక్షల నుండి రూ. 15 లక్షలకు పెంపు

N Chandrasekaran
న్యూఢిల్లీ: దేశయ అతిపెద్ద ఐటీ దిగ్గజం టీసీఎస్ (టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్‌) కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ చంద్రశేఖరన్‌కు నెలకు వేతనాన్ని గరిష్టంగా 50 శాతం లేదా రూ. 15 లక్షలు పెంచినట్లు తెలిపింది. సవరించిన ఈ వేతనం ఏప్రిల్ 1, 2014 నుండి అమల్లోకి వస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ చంద్రశేఖరన్ వేతనాన్ని పెంచేముందు షేర్ హోల్డర్ల అనుమతి పొందినట్లు పేర్కొంది.

అక్టోబర్ 2009లో ఎన్ చంద్రశేఖరన్ టీసీఎస్ (టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్‌) కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమితులైనారు. 40 శాతం హైక్‌తో జులై 2011 వరకూ రూ. 10 లక్షలు వేతనం తీసుకున్నారు. ఇటీవల స్టాక్ ఎక్సేంజ్‌ల్లో ఫైలింగ్ చేసేటప్పుడు టీసీఎస్ (టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్‌) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్ చంద్రశేఖరన్ వేతనం ఏప్రిల్ 1, 2014 నుండి రూ. 10 లక్షల నుండి రూ. 15 లక్షలకు పెంచుతున్నట్లు పేర్కొంది. చంద్రశేఖరన్‌ అదనపు వ్యాపార బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో వేతనం పెంచినట్లు తెలిపింది. వీటితో పాటు అదనపు బోనస్‌లు ఇవ్వనున్నట్లు పేర్కొంది. మార్చి 31, 2013తో ముగిసిన కాలానికి టీసీఎస్ సీఈవో వేతనం రూ.12 కోట్ల వరకు చెల్లించింది.

భారత ఐటీ రంగం విపరీతమైన పోటీని ఎదుర్కొంటునప్పటికీ.. టీసీఎస్ మాత్రం తన వార్షిక ఫలితాల్లో 14 శాతం వృద్ది రేటుని నమోదు చేసింది. మార్కెట్ నిపుణుల అంచనాలను అధిగమిస్తూ టీసీఎస్ జనవరి- మార్చి క్వార్టర్‌లో 22 శాతం పెరిగి రూ. 3,596.9గా నికర లాభాన్ని నమోదు చేసింది. ఇక నాస్కమ్‌ 2013-14 ఆర్దిక సంవత్సారనికి గాను భారత్‌ ఐటీ రంగంలో వృద్ధిరేటు 11 శాతం అంచనా వేసింది. ఐతే టీసీఎస్ మాత్రం నాస్కామ్ అంచనాలను అధిగమించి 2013-14 ఆర్థిక సంవత్సరానికి 12-14శాతం వృద్ధిరేటును సాధించే అవకాశం కనిపిస్తోంది.

వన్ఇండియా మనీ తెలుగు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+