దిగుమతి సుంకం పెంపు.. 10 గ్రాముల బంగారంపై రూ. 500 వరకూ పెరిగే అవకాశం

Gold
న్యూఢిల్లీ: కరెంట్ అకౌంట్ లోటును తగ్గించే భాగంలో కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 2శాతానికి పెంచుతున్నట్లు బుధవారం రెవెన్యూ శాఖ కార్యదర్శి సుమిత్ బోస్ తెలిపారు. దీంతో ప్రస్తుతం 6 శాతంగా ఉన్న దిగుమతి సుంకం 8 శాతానికి పెరిగింది. బంగారం ధరలను పెంచడం ద్వారా ప్రజలను బంగారానికి దూరంగా ఉంచడంతో పాటు దిగుమతుల తగ్గింపు ద్వారా కరెంట్ అకౌంట్ లోటును అరికట్టే భాగంలో ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ధరల పెరగడం వల్ల బంగారంపై మోజు తగ్గుతుందని భావిస్తున్నారు.

Real Estate Bill likely to make homes costlier

ఇది ఇలా ఉంటే బంగారం దిగుమతులపై సుంకం పెంచడం ఆరు నెలల్లో ఇది రెండవసారి. ఈ ఆరు నెలల్లో రెండు దఫాలుగా కేంద్ర ప్రభుత్వం 4 శాతం సుంకాన్ని పెంచింది. బంగారం,ముడిచమురు దిగుమతులు పెరుగుతండటంతో క్యాడ్ పెరుగుతుంది. దీంతో బంగారం దిగుమతులను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పలు చర్యలు తీసుకుంటుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం 15రోజులకొకసారి బంగారం, వెండి సహా విలువైన మెటల్స్ సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంది. బంగారం దిగుమతులపై టారిఫ్ విలువను ఆదివారం 459 డాలర్లకు పెంచింది.

ఇలా బంగారం దిగుమతిపై సుంకాన్ని పెంచడం వల్ల 10 గ్రాములకు స్పాట్ మార్కెట్లలో ధర సుమారు రూ. 500 వరకూ పెరుగుతుందని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు.

వన్ఇండియా మనీ తెలుగు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+