ఇన్పోసిస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మూర్తి.. పై స్దాయిలో మార్పులు

ఇటీవలే మనం గనుక గమనించినట్లైతే నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ అయిన కాగ్నిజంట్ వార్షిక ఫలితాలను గమనిస్తే ఆర్దిక పరంగా అనలిస్ట్‌ల అంచనాలను తారుమారు చేస్తూ దేశంలో రెండవ అతి పెద్ద ఐటీ దిగ్గజ కంపెనీగా అవతరించింది. ఇక హెచ్‌సీఎల్ కూడా అనుకున్న దాని కంటే మంచి ఫలితాను నమోదు చేసింది. ఇక టీసీఎస్ నెంబర్ వన్ స్దానంలో కొనసాగుతూనే ఉంది. 2008లో ఇన్పోసిస్ క్వార్టర్లీ ఫలితాలు ఒక్కసారిగా తగ్గడం.. అప్పటి నుండి ప్రతి క్వార్టర్లీ కూడా అనలిస్ట్‌ల అంచనాలను చేరువ కాలేకపోయింది. వీటన్నింటిని గాడిలో పెట్టేందుకు మళ్లీ నారాయణమూర్తి కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. జూన్ 1వ తేదీ నుంచి నారాయణమూర్తి సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, అదనపు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారని ఇన్పోసిస్ తెలిపింది.
బోర్డు చైర్మన్ పదవికి 65 ఏళ్ల కెవి కామత్ రాజీనామా చేశారు. జూన్ 1వ తేదీ నుంచి ఆయన లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. తిరిగి తనను బోర్డులకు ఆహ్వానించడంపై నారాయణ మూర్తి మాట్లాడుతూ ఇది అకస్మాత్తుగా, అనూహ్యంగా, అసాధారణంగా జరిగిందని అన్నారు. ఇన్ఫోసిస్ తన మిడిల్ చైల్డ్ అని, దాంతో మిగతా ప్రణాళికలను పక్కన పెట్టి తాను బాధ్యతలను అంగీకరించానని అన్నారు. ఇన్పోసిస్ ఛైర్మన్‌గా తిరిగి నారాయణ మూర్తి నియమితులైన తర్వాత పైస్దాయిలో మార్పులు మొదలయ్యాయి. ఇన్పోసిస్ అనుబంధ సంస్ద లోడ్ స్టోన్ చైర్మన్ బీజీ శ్రీనివాసన్ స్దానంలో వి. బాలకృష్ణన్‌ను నియమించారు. గంతలో ఈయన ఇన్పోసిస్ సీఎఫ్‌ఓ.
ఇన్పోసిస్‌కు డైరెక్టర్ కూడా అయిన వి. బాలకృష్ణన్ కంపెనీ సీఎఫ్‌ఓగా చేయకముందు ఇన్పోసిస్ బీపీఓకు అధిపతిగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే లోడ్ స్టోన్ బోర్డులో బీజీ శ్రీనివాస్ కీలక సభ్యుడిగా కొనసాగుతాడని ఇన్పోసిస్ పేర్కొంది. 330 మిలియన్ స్విస్ ప్రాంకులు (సుమారు రూ. 1932 కోట్లు) పెట్టి లోడ్ స్టోన్‌ను అక్టోబర్ 22, 2012లో ఇన్పోసిస్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. సాంకేతిక పరిశ్రమ, సంస్థ ప్రస్తుతం ఎదుర్కుంటున్న సవాళ్ల నేపథ్యంలో స్టేక్‌హోల్డర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకున్నామని కామత్ అన్నారు. సవాళ్లను ఎదుర్కుంటున్న ఈ సమయంలో ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్‌ను బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు.
వన్ఇండియా మనీ తెలుగు


Click it and Unblock the Notifications