18 నెలల్లోనే బ్యాంకును, శాఖలను ఏర్పాటు చేయాలి: ఆర్‌బీఐ

Bank
ముంబై: కొత్త బ్యాంకుల లైసెన్స్ కార్యక్రమంలో భాగంగా లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేస్తూ ఆర్‌బీఐ నిన్న నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఐతే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, దరఖాస్తు చేసుకున్న అన్ని సంస్దలకూ బ్యాంకింగ్ లైసెన్స్‌లు ఇవ్వడం సాధ్యం కాదని ఆర్‌బీఐ తేల్చిచెప్పింది. దీనితో పాటు బ్యాంకులకు అనుమతి ఇచ్చేందుకు గాను నిర్దిష్ట సంఖ్య అంటూ ఏమీ లేదని పేర్కొంది. ఆర్‌బీఐ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం బ్యాంకు ఏర్పాటుకు ఇచ్చే అనుమతులు 18 నెలలు పాటు వర్తిస్తాయి.
(Income-Tax department to put salary slips of top India Inc executives under TDS scanner)

ఏ సంస్దలైతే అర్‌బీఐ నుండి అనుమతులు పొందుతాయో.. అనుమతులు పొందిన తేదీ నుండి 18 నెలల్లోగా ప్రమోటర్లు/ప్రమోటరు గ్రూపు నాన్ ఆపరేటివ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ (ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ)ని ఏర్పాటు చేయాలి. ఇది మాత్రమే కాదు ఈ 18 నెలల్లోనే బ్యాంకును, శాఖలను ఏర్పాటు చేసి బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రారంభించాలి. దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కలిగిన సంస్దల్లో కనీసం 51 శాతం పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఉండాలి. అలా లేని పక్షంలో నియమ నిబంధనలతో కూడిన ప్రణాళికను దరఖాస్తుతో పాటు సమర్పించాలి. నాన్ ఆపరేటివ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ ఎలా ఉండాలి.. దాని తీరు తెన్నులు ఏంటనేవి మార్కెట్ రెగ్యులేటరీ సంస్ద సెబీ, ఐఆర్‌డీఎ సంస్దలు ఓ నిర్ణయం తీసుకుంటాయి.

కొత్త బ్యాంకింగ్ లైసెన్సులపై ఫిబ్రవరి 22న ఆర్‌బీఐ మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కంపెనీలు దరఖాస్తు చేసుకునేందుకు జూలై 1 ఆఖరు తేదీ. ఆర్‌బీఐ విడుదల చేసిన మార్గదర్శకాలపై 39 సంస్థలు 443 సందేహాలు వ్యక్తం చేశాయి. ఈ సందేహాలను నివృత్తి చేస్తూ ఆర్‌బీఐ నిన్న నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఆర్‌బీఐ సందేహాలను నివృత్తిపై ఎర్న్‌స్ట్ అండ్ యంగ్ ఇండియా పార్ట్‌నర్ అశ్విన్ పరేఖ్ మాట్లాడుతూ కొత్త లైసెన్సుల ప్రక్రియపై మరింత స్పష్టత వచ్చిందని అన్నారు. దీంతో లైసెన్సు దక్కించుకోవడం మరింత కఠినతరం కావచ్చునని అన్నారు. ఈ సందేహాలను బట్టి చూస్తుంటే ఎన్‌బీఎఫ్‌సీల కన్నా కార్పొరేట్లకే లెసైన్సులు దక్కే అవకాశాలు ఎక్కువున్నాయని పరేఖ్ తెలిపారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+