న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకు అయినటువంటి కెనరా బ్యాంక్ వచ్చే నెల ఒకటో తారీఖు నుండి తన ఏటీఎమ్ డెబిట్ కార్డులపై రూ. 112 సంవత్సర ఫీజును వసూలు చేయనుంది. ప్రస్తుతం తన కస్టమర్స్‌కు ఉచితంగా అందిస్తున్న ఈ కార్డులపై సంవత్సర ఫీజును వసూలు చేయనున్నట్లు బ్యాంక్ పేర్కొంది. ఏటీఎమ్ కార్డు జారీ చేసిన ఏడాది తర్వాత రూ. 100 చార్జీతో పాటు దీనిపై సర్వీస్ ట్యాక్స్‌ను (ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సర్వీసు టాక్స్ 12 శాతం వసూలు చేస్తుంది) కలుపుకోని చార్జీగా వసూలు చేస్తామని.. ఆ తర్వాత నుండి ప్రతి సంవత్సరం ఇదే విధంగా (రూ. 100తో పాటు సర్వీసు ట్యాక్స్‌ను) సంవత్సర ఫీజుగా వసూలు చేయనున్నట్లు కెనరా బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఐతే కెనరా బ్యాంక్ స్మాల్ సేవింగ్స్ ఎకౌంట్, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ ఎకౌంట్, ఫైనాన్షియల్ సేవింగ్స్ ఎకౌంట్ ఖాతాదారులకు ఈ ఛార్జీల నుండి మినహాయింపు ఇవ్వనున్నట్లు పేర్కొంది.
(SBI Home Loans: 3 reasons to opt for them)
ఇటీవల ఖాతాదారులకు అతి తక్కువ ధరకే బీమా రక్షణను కల్పించడానికి ‘ఫ్రీడమ్ సురక్షా' పేరుతో కెనరా బ్యాంక్ కూడా ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. రూ. లక్ష బీమా కోసం 18 నుంచి 35 ఏళ్ల వ్యక్తులు సంవత్సరానికి ప్రీమియంగా రూ.177 చెల్లిస్తే సరిపోతుంది. 36 నుంచి 50 ఏళ్లలోపు ఉన్న ఖాతాదారులు రూ.366, ఆపైన వయస్సున్న వారు రూ.988 చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే రెండు నెలల్లో కనీసం 10 లక్షల మంది ఖాతాదారులకు ఈ బీమా సౌకర్యాన్ని కల్పించాలని కెనరా బ్యాంక్ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
కెనరా బ్యాంకుతో పాటు కార్పోరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఐడీబీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్‌లు డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌కు సుమారు రూ. 5000 కోట్లకుపైగా రుణాలిచ్చాయి. కెనరా బ్యాంక్ డీసీహెచ్‌ఎల్‌కు రూ. 330 కోట్ల రుణాలిచ్చినట్లు.. అందులో రూ. 225 కోట్లు మొండి బకాయిలుగా తమ బ్యాంక్ Q2 లాభనష్టాల్లో చూపించామని అన్నారు.
వన్ఇండియా మనీ తెలుగు
Share This Article
English summary
వచ్చే నెల 1 నుండి డెబిట్ కార్డుపై కెనరా బ్యాంక్ వార్షిక చార్జీ రూ. 112 | Canara Bank to charge annual fee on debit cards | వచ్చే నెల 1 నుండి డెబిట్ కార్డుపై కెనరా బ్యాంక్ వార్షిక చార్జీ రూ. 112
State-owned Canara Bank will levy about Rs 112 annual fee on its ATM debit cards from July 1.
Story first published: Monday, June 3, 2013, 13:05 [IST]