
ఇక స్వయంగా ఐటీ శాఖ రంగంలోకి దిగి నోటీసులు పంపడంతో వాటికి మంచి స్పందన లభిస్తోందని, నోటీసులు అందుకున్న వారిలో చాలా మంది పన్నులు కడుతున్నారని, ఐటీ రిటర్న్‌లు ఫైల్ చేస్తున్నారని కేంద్ర ఆర్దిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. గత ఏడాది రూ 5.65 లక్షల కోట్లుగా ఉన్న ప్రత్యక్ష పన్నుల వసూళ్లను ఈ ఏడాదిలో రూ 6.68 లక్షల కోట్లకు పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. సేవా పన్ను ఎగవేతదారులను అరెస్ట్ చేసేందుకు మరియు ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధించేందుకు తగిన అధికారాలను రెవెన్యూ శాఖ అధికారులకు కలిగించేలా 2013 ఫైనాన్స్ బిల్లులో ఆమోద ముద్ర వేశారు. దీనితో సేవా పన్ను ఎగవేతదారులను అరెస్ట్ చేసేందుకు రెవెన్యూ అధికారులకు అధికారం లభించింది.
సేవా పన్ను కింద 17 లక్షలకుపైగా అసెసీలు రిజిస్టరై ఉన్నప్పటికీ, 7 లక్షల మంది మాత్రమే రిటర్న్‌లు దాఖలు చేస్తుండటంతో ఆర్థిక శాఖ ఈ పథకానికి రూపకల్పన చేయడం జరిగిందని చిదంబరం పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా అసెసీలు 2013, డిసెంబర్ 31లోగా డిక్లరేషన్‌ను ఇవ్వాలి. దీంతోపాటు 50%కు తక్కువకాకుండా పన్ను బకాయిలను డిసెంబర్ 31లోగా చెల్లించాలి. ఆ తర్వాత 2014, జూన్ 30లోగా మిగిలిన బకాయిలను చెల్లించేందుకు కేంద్ర ఆర్దిక శాఖ అనుమతి ఇస్తుంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications