
(Gold saving schemes from jewellers: should you buy?)
ఇక వివరాల్లోకి వెళితే తీసుకున్న రూ. 50 కోట్ల రుణం చెల్లించలేదని డెక్కన్‌క్రానికల్ హోల్డింగ్స్‌కు చెందిన హైదరాబాద్ కొండాపూర్‌లో వున్న ప్రింటింగ్ కార్యాలయాన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ నెల 15న సీజ్ చేసింది. తీసుకున్న రుణం చెల్లింపు విషయంలో విఫలమైనందుకు గాను డెక్కన్ క్రానికల్ ప్రింటింగ్ కార్యాలయానికి తాళం వేసింది. ఇటీవలే న్యాయస్దానం స్వాధీన ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో స్థానిక కోర్టు జారీచేసిన ఆర్డరు మేరకు అడ్వొకేట్లు, మాదాపూర్ పోలీసులతో కోటక్ మహీంద్రా అధికారులు బుధవారం ప్రింటింగ్ కార్యాలయానికి చేరుకోని న్యాయస్దానం జారీ చేసిన స్వాధీన ఉత్తర్వులను చూపించారు. ప్రింటింగ్ ప్రెస్ స్వాధీనానికి తమకు సహకరించాల్సిందిగా మాదాపూర్ పోలీసులను కోరడంతో వారూ వచ్చారు. కొండాపూర్ సర్వేనెంబర్ 186లోని 9892.6 చదరపు గజాల స్థలంతో ఈ భవనం ఉంది. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది, ఇతరులతో బ్యాంకు అధికారులు మాట్లాడి కోర్టు ఉత్తర్వులు చూపించి తాళం వేశారు. దీనిపై వెంటనే స్పందించిన ఉద్యోగ సంఘాలు హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశాయి. వేసవి సెలవులు కావడంతో రిట్ పిటీషన్ వెకేషన్ కోర్టుకు వెళ్లింది.
ఉద్యోగుల భవిష్యత్తు, పత్రికా స్వేచ్ఛకు ముడిపడి ఉండటంతో జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి ఇంటి వద్దనే కేసు విచారణ చేపట్టారు. 1984, 1994 సంవత్సరాల్లో న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ప్రింటింగ్ ప్రెస్‌ను రహదారుల విస్తరణ, న్యూస్ ప్రింట్ పాలసీ నిబంధనల పేరుతో మూసి వేశారు. ఆ సందర్భంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని ప్రింటింగ్ ప్రెస్‌ను మూసివేయడం కచ్చితంగా భావస్వేచ్ఛను అడ్డుకోవడం కిందకే వస్తుందని, ప్రభుత్వాలకు అటువంటి హక్కు లేదని తీర్పు నిచ్చింది. ఈ తీర్పులను దృష్టిలో పెట్టుకొని సింగిల్ జడ్జి కూడా డెక్కన్ క్రానికల్ పై విధంగా స్పందించారు. ఈ తీర్పు కాపీలను తీసుకొని పోలీసుల వెంట రాగా రాత్రి 2.30 తర్వాత ప్రింటింగ్ ప్రెస్ కార్యాలయంలోకి ఉద్యోగులు అడుగు పెట్టారు.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications