మంచి వాల్యూమ్ కలిగి ఉంటేనే స్టాక్స్‌లో ట్రేడింగ్: ప్రతీప్ చౌధురి

ఇది ఇలా ఉంటే 2012-13 ఆర్థిక సంవత్సరానికి ఎస్‌బీఐ నికర లాభం 20 శాతం ఎగబాకి రూ. 14,105 కోట్లుగా నమోదైంది. దీంతో ఓఎన్‌జీసీ, రిలయన్స్ తర్వాత ఎక్కువ లాభాలు ఆర్జించిన మూడో కంపెనీగా ఎస్‌బీఐ నిలిచింది. నికర వడ్డీ ఆదాయాలను తగ్గించుకోవడంలో భాగంగా ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్‌కు దిగువనున్న కంపెనీలకు రుణాలివ్వడంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించనున్నాం. ఒకవేళ ఇటువంటి ఖాతాలకు రుణాలు ఇవ్వాల్సివచ్చినా... తగినమొత్తంలో కొలేటరల్ సెక్యూరిటీని తీసుకునేలా జాగ్రత్త వహిస్తాం. మంచి ట్రేడింగ్ పరిమాణం, తక్కువ హెచ్చుతగ్గులు ఉండే కంపెనీల స్టాక్స్‌లో మాత్రమే పెట్టుబడులు పెట్టాలని ఎస్‌బీఐ బ్యాంక్ నిర్ణయించిందని అన్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) Q4 ముఖ్యాంశాలు:
* రుణ వృద్ధి 21 శాతంగా నమోదైంది.
* Q4లో నికర వడ్డీ మార్జిన్ 3.34 శాతానికి తగ్గింది.
* ఇక డిపాజిట్లు 15% వృద్ధితో రూ. 12.03 లక్షల కోట్లకు పెరిగాయి.
* Q4లో నికర వడ్డీ ఆదాయం రూ.11,591 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 4.42 శాతం తక్కువ.
* గత ఏడాది రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరుపై బ్యాంక్ రూ. 41.50 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది.
వన్ఇండియా మనీ తెలుగు


Click it and Unblock the Notifications