
కొత్తగా లభించిన అధికారాల ప్రకారం ఏదైనా కంపెనీ మేనేజర్ లేదా డెరైక్టర్ సేవా పన్ను వసూళ్లను ప్రభుత్వానికి చెల్లించకపోతే అరెస్ట్ వంటి చర్యలను ఎదుర్కోవడంతో పాటు... ఏడేళ్ల వరకూ జైలు శిక్షకు గురికావాల్సి వస్తుంది. వీటితోపాటు రూ. లక్ష వరకూ జరిమానాను సైతం చెల్లించాల్సి ఉంటుంది. 2013 ఫైనాన్స్ బిల్లులో ఇందుకు అనుగుణంగా కస్టమ్స్, కేంద్ర ఎక్సైజ్ ట్యాక్స్ చట్టానికి చేసిన మార్పులను అనుమతిస్తోంది. దీనితో పాటు పరోక్ష పన్నుల వసూళ్లను పెంచే బాటలో ఆర్థిక శాఖ సర్వీస్ ట్యాక్స్ ఎగవేతదారులకు ఒకేసారి చెల్లించే (వన్‌టైమ్) ఆమ్నెస్టీ పథకాన్ని అందిస్తుంది.
ఇలా చేయడం వల్ల ఎగవేతదారులు జరిమానా లేదా ఆలస్యపు చార్జీల వంటి వడ్డింపులు లేకుండా తమ బకాయిలను చెల్లించేందుకు వీలు కలుగుతుంది. బకాయిలు చెల్లించేందుకు గాను 2007, అక్టోబర్1 మొదలు 2012, డిసెంబర్ 31 వరకూ అనుమతిస్తున్నారు. ఈ ఆమ్నెస్టీ పథకాన్ని రూపొందించడం ఇదే తొలిసారి. ఆర్థిక మంత్రి పి చిదంబరం 2013-14 బడ్జెట్‌లో దీనిని ప్రవేశపెట్టారు. సేవా పన్ను కింద 17 లక్షలకుపైగా అసెసీలు రిజిస్టరై ఉన్నప్పటికీ, 7 లక్షల మంది మాత్రమే రిటర్న్‌లు దాఖలు చేస్తుండటంతో ఆర్థిక శాఖ ఈ పథకానికి రూపకల్పన చేయడం జరిగిందని చిదంబరం పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా అసెసీలు 2013, డిసెంబర్ 31లోగా డిక్లరేషన్‌ను ఇవ్వాలి. దీంతోపాటు 50%కు తక్కువకాకుండా పన్ను బకాయిలను డిసెంబర్ 31లోగా చెల్లించాలి. ఆ తర్వాత 2014, జూన్ 30లోగా మిగిలిన బకాయిలను చెల్లించేందుకు కేంద్ర ఆర్దిక శాఖ అనుమతి ఇస్తుంది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications