
దీంతో స్థానిక కోర్టు జారీచేసిన ఆర్డరు మేరకు అడ్వొకేట్లు, మాదాపూర్ పోలీసులతో కోటక్ మహీంద్రా అధికారులు బుధవారం ప్రింటింగ్ కార్యాలయానికి చేరుకోని న్యాయస్దానం జారీ చేసిన స్వాధీన ఉత్తర్వులను చూపించారు. ప్రింటింగ్ ప్రెస్ స్వాధీనానికి తమకు సహకరించాల్సిందిగా మాదాపూర్ పోలీసులను కోరడంతో వారూ వచ్చారు. కొండాపూర్ సర్వేనెంబర్ 186లోని 9892.6 చదరపు గజాల స్థలంతో ఈ భవనం ఉంది. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది, ఇతరులతో బ్యాంకు అధికారులు మాట్లాడి కోర్టు ఉత్తర్వులు చూపించి తాళం వేశారు.
కార్యాలయంలోని మెషిన్లు, ఇతర సామాగ్రిని వీడియో చిత్రీకరించారు. తమకు రూ.50,28,51,220 మొత్తం బకాయి ఉందని, ఈ మొత్తాన్ని 2012 ఆగస్టు15 లోగానే చెల్లించాల్సి ఉందని నోటీసులో పేర్కొన్నారు. న్యాయ స్దానం ఉత్తర్వుల మేరకు స్వాధీన కార్యక్రమం పూర్తి అయ్యాక కోటక్ మహీంద్రా బ్యాంక్ అధికారులు ఆ స్దలంలో ఒక బ్యానర్ ఉంచారు. అండర్‌ది ప్రొవిజన్ ఆఫ్ సెక్షన్ 13(4)/ ఎస్‌ఏఆర్‌ఎఫ్‌ఈఏ ఎస్‌ఐ యాక్ట్ 2002 ప్రకారం సీజ్ చేసినట్లుగా పేర్కొన్నారు. బ్యాంకు అధికారులు తాళం వేసి వెళ్లాక ప్రింటింగ్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రెండో షిప్టు సిబ్బంది సాయంత్రం విధులకు హాజరయ్యేందుకు రాగా.. అక్కడున్న కాపలాదారులతో మాట్లాడి విషయం తెలుసుకోని వెళ్లిపోయారు. ఇందులో సుమారుగా వంద మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications