అక్షయ తృతీయ @ పసిడి.. గత ఏడాదితో పోల్చితే 15శాతం అధికం

ఇది ఇలా ఉంటే అక్షయ తృతీయ రోజున నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) నిర్వహించిన ప్రత్యేక ట్రేడింగ్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల లావాదేవీలు సైతం 14% పుంజుకుని రూ. 691 కోట్లను తాకడం విశేషం. ధరలు భారీగా పతనంకావడంతో గత నెలలో మొదలైన పసిడి కొనుగోళ్లు సోమవారం మరింత పుంజుకున్నాయని జ్యువెలర్స్ తెలిపారు. దేశవ్యాప్తంగా కనీసం 10-15% అధికంగా అమ్మకాలు నమోదై ఉండ వచ్చునని ముంబై బులియన్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ సురేష్ హుండియా అంచనా వేశారు.
అక్షయ తృతీయ రోజున జరిగిన కొనుగోళ్లను బట్టి చూస్తే సుమారుగా 25 టన్నుల అమ్మకాల జరిగి ఉండవచ్చునని ముంబై జ్యువెలర్స్ అసోసియేషన్ వైస్‌చైర్మన్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ఇదే అక్షయ తృతీయ రోజున గత ఏడాది 17 టన్నుల బంగారాన్ని విక్రయించామన్నారు. అంతర్జాతీయంగా ధర తగ్గడంతో బంగారం అమ్మకాలు 15% పురోగమించాయి. ధర తగ్గడంతో ఈ ఏడాది 900 టన్నుల బంగారాన్ని ఇండియా దిగుమతి చేసుకునే అవకాశమున్నదని సోమసుందరం అంచనా వేశారు. గతేడాది 860 టన్నులను దిగుమతి చేసుకున్నట్లు తెలిపారు.
అక్షయ తృతీయ రోజు(మే 13)న దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరలు:
ఢిల్లీలో రూ. 200 తగ్గి రూ. 27,520
ముంబైలో రూ. 390 తగ్గి రూ. 26,985
కోల్‌కతాలో రూ. 260 తగ్గి రూ. 27,550
చెన్నైలో రూ. 200 తక్కువగా రూ. 27,710 వద్ద ముగిశాయి.


Click it and Unblock the Notifications