మళ్లీ తగ్గిన బంగారం, ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు

(Student insurance policy: A must before going abroad for studies)
ఏప్రిల్ నెల మొత్తంలో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో 174 టన్నుల బంగారాన్ని అమ్మడంతో.. ఈ ప్రభావం బంగారంపై పడింది. ఇది ఇలా ఉంటే వెండి ధర కూడా క్రమక్రమంగా పడుతుంది. రాత్రి ఎంసీఎక్స్‌లో కేజీ వెండి ధర రూ. 1020 వరకూ నష్టపోయి 43,813 వద్ద ముగిసింది. ఇక ఈరోజు ఔన్స్ వెండి ధర 23.5 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ఇక స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ ఫిబ్రవరి 4 తర్వాత మళ్లీ 6వేల పాయింట్లకు చేరింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో 70 పాయింట్ల వరకూ లాభపడుతూ 6వేలకు పైగా ట్రేడవుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్
230 పాయింట్ల దాకా లాభపడుతూ 19,730 పాయింట్లకు సమీపంలో కొనసాగుతోంది. ఈరోజు అన్ని సెక్టోరల్ సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
భారతదేశానికి చెందిన ప్రధాన నగరాల్లో ఈరోజు (ఏప్రిల్ 30)న 24 క్యారెట్ల బంగారం ధరలు ఈ క్రింద విధంగా ఉన్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధరలు:
ముంబై: 10 గ్రాముల బంగారం ధర రూ. 27,815
ఢిల్లీ: 10 బంగారం ధర రూ. 27,900
చెన్నై: 10 బంగారం ధర రూ. 27,740
కోలకతా: 10 బంగారం ధర రూ. 27,825
బెంగుళూర్: 10 బంగారం ధర రూ. 27,735
హైదరాబాద్: 10 బంగారం ధర రూ. 28,200
వన్ఇండియా మనీ తెలుగు


Click it and Unblock the Notifications