అంచనాలను అందుకున్న ఐసీఐసీఐ @Q4: నికర లాభం రూ. 2,304కోట్లు

ఐసీఐసీఐ క్యూ4లో కన్సాలిడేటెడ్ (బీమా, మ్యూచువల్ ఫండ్ తదితర అనుబంధ సంస్థలతో కలిపి) ప్రాతిపదికన మంచి ఫలితాలను నమోదు చేసింది. నికర లాభం 38 శాతం వృద్ధితో రూ.2,492 కోట్లకు ఎగసింది. 2011-12 ఏడాది క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.1,810 కోట్లు. సాధారణ బీమా సబ్సిడరీ సంస్థ లాభాల జోరు బ్యాంక్‌కు కలిసొచ్చిందని పేర్కొంది. దీనితో పాటు క్యూ4లో బ్యాంక్ మొత్తం రుణాల్లో మొండి బకాయిలు(ఎన్‌పీఏలు) 2.68 శాతానికి తగ్గాయి. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో దీని నిష్పత్తి 3.04గా ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల ఎన్‌పీఏలు 3.04 శాతం నుంచి 2.68 శాతానికి తగ్గాయి. అయితే, నికర ఎన్‌పీఏలు మాత్రం స్వల్పంగా 0.62 శాతం నుంచి 0.64 శాతానికి పెరిగాయి. మార్చి త్రైమాసికంలో రూ.788 కోట్ల రుణాలను బ్యాంక్ పునర్‌వ్యవస్థీకరించగా... మార్చి చివరి నాటికి మొత్తం పునర్‌వ్యవస్థీకరించిన రుణాలు రూ.5,313 కోట్లు. ఇది ఇలాఉంటే ఇటీవల కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్‌లో మనీలాండరింగ్ జరుగుతుందంటూ వచ్చిన వాదనలను కొట్టిపారేశారు. మనీలాండరింగ్‌కు సంబంధించి తమ బ్యాంకుపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీనిపై ఆడిట్ నిర్వహించామని, అయితే ఇందులో కొన్ని లావాదేవీలపరమైన పొరపాట్లు మాత్రమే వెలుగుచూశాయని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. మనీలాండరింగ్ జరిగిన దాఖలాలేవీ లేవని ఫలితాల సందర్భంగా బ్యాంక్ సీఈఓ, ఎండీ చందా కొచర్ స్పష్టం చేశారు.
వన్ఇండియా మనీ తెలుగు


Click it and Unblock the Notifications