రాజధానిలో రూ. 28,000 మార్కును చేరుకున్న బంగారం

(A comparison of the cheapest home loan rates in India)
బంగారంతో పాటు వెండి ధర కూడా కిలోకి రూ. 500 పెరిగి రూ. 45,500 వద్ద ముగిసింది. ఇటీవల కాలంలో చూసినట్లైతే ఏప్రిల్ 15 తర్వాత పసిడి ధర మళ్లీ గరిష్ట స్దాయికి చేరుకుందని నిపుణులు తెలిపారు. దీనికి కారణం ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులతో పాటు, పెళ్లిళ్ల సీజన్ రావడంతో స్టాకిస్టులు, ట్రేడర్లు, వినియోగదారులు భారీగా బంగారం కొనుగోళ్లు జరపడమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.
ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు:
లండన్ కమోడిటీస్ మార్కెట్లో పుత్తడి ధర ఔన్సుకు (31.1 గ్రాములు) 1.1 శాతం పెరిగి 1,448.28 వద్ద ట్రేడయ్యింది. ఏప్రిల్ 15న పసిడి రేటు 9.1 శాతం వరకూ పతనమైంది. గత పన్నెండు సంవత్సరాల నుండి పెరుగుతూ పోయిన బంగారం ఈ ఏడాది ఇప్పటిదాకా 14 శాతం మేర తగ్గింది.
ఏప్రిల్ 16న రెండేళ్ల కనిష్టమైన 1,321.95 డాలర్లకు పడిపోయింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి(ఏప్రిల్ 25వ తారీఖు)న ధరలు:
ముంబై: 10 గ్రాముల బంగారం ధర రూ. 26.710
ఢిల్లీ: 10 బంగారం ధర రూ. 27.080
చెన్నై: 10 బంగారం ధర రూ. 27.050
కోలకతా: 10 బంగారం ధర రూ. 27.050
బెంగుళూర్: 10 బంగారం ధర రూ. 27.091
హైదరాబాద్: 10 బంగారం ధర రూ. 27.035
వన్ఇండియా మనీ తెలుగు


Click it and Unblock the Notifications