
రూ. 10 ముఖ విలువ గల ఒక్కో షేరుకి రూ.754.74 ధరతో ఫ్రిఫరెన్షియల్ కేటాయింపు చేయనున్నట్లు జెట్ ఎయిర్‌వేస్ పేర్కొంది. జెట్ ఎయిర్‌వేస్ చైర్మన్ నరేశ్ గోయల్, ఎతిహాద్ ప్రెసిడెంట్-సీఈఓ జేమ్స్ హోగాన్‌లు ఈ ఒప్పందాన్ని అబుదాబీలో ప్రకటించారు. ఈ ఒప్పందం పూర్తయితే జెట్‌లో (పెరిగిన షేర్ క్యాపిటల్‌లో) ఎతిహాద్‌కు 24% వాటా లభిస్తుందని ఇరు కంపెనీల తమ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. దీంతో దేశీయ విమానయాన రంగ కంపెనీ అయిన జెట్ ఎయిర్‌వేస్‌లోకి తొలిసారిగా విదేశీ ఎయిర్‌లైన్స్ అయిన ఇతిహాద్ అడుగుపెట్టేందుకు మార్గం సుగమమైంది.
భారత్‌కు చెందిన ఎయిర్‌లైన్స్ కంపెనీల్లో విదేశీ ఎయిర్స్‌లైన్స్ 49 శాతం వరకూ వాటాలను కొనుగోలు చేసేందుకు వీలుకల్పిస్తూ గత ఏడాది ఎఫ్‌డీఐ నిబంధనలను ప్రభుత్వం సడలించిన సంగతి తెలిసిందే. దీంతో విదేశాలకు చెందిన ఎయిర్‌లైన్స్ దృష్టి నెమ్మది నెమ్మదిగా భారత్‌పై పడుతుంది. ఇటీవలే టాటాలతో కలిసి జాయింట్ వెంచర్(జేవీ) ద్వారా సింగపూర్‌కు చెందిన ఎయిర్ ఏషియా భారత్‌లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. భారతదేశంలో చౌక ధరలతో విమానాలు నడపాలన్న ఎయిర్ ఏషియా కోరిక తీరుతుంది. టాటాలతో కలసి మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా ఏర్పాటు చేస్తున్న జాయింట్ వెంచర్ (జేవీ) పేరుకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆమోదం లభించింది. ఈ జాయింట్ వెంచర్‌కు ఎయిర్ ఏషియా(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ పేరును కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. మహారాష్ట్రలో కంపెనీ ఈ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుంది.
కొత్త ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌ఏషియా 49 శాతం, టాటాసన్స్ 30 శాతం, టెలిస్ట్రా ట్రేడ్‌ప్లేస్ 21 శాతం పెట్టుబడులు పెట్టి కొత్త ఎయిర్‌లైన్‌ను ప్రారంభిస్తాయని ఎయిర్ ఏషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. చెన్నై నుండి ఒక స్మార్ట్ బాయ్‌ని సీఈఓగా నియమించామని ఎయిర్ ఏషియా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టోనీ ఫెర్నాండెజ్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ట్వీట్ చేశాడు. ఇతని రెజ్యుమో అద్బుతంగా ఉంది. ఇతను తప్పక అందరినీ ఆకట్టుకోగలడని అన్నారు. ఈ స్మార్ట్ బాయ్‌కు చెందిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. కంపెనీ ఎదిగే కొద్ది మరింత మందిని ఉద్యోగంలో తీసుకుంటామని ఆయన వివరించారు. ప్రస్తుతం నిబంధనల ప్రకారం ప్రతి ఎయిర్ క్రాప్ట్‌కి సుమారు 20 మందిని తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో విమానయాన సంస్ద సేవలు ప్రారంభించగదలని ఇటీవల మలేసియా విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ తెలిపిన విషయం తెలిసిందే.
జెట్ ఎయిర్‌వేస్ - ఇతిహాద్ ఒప్పందం వల్ల దేశీయంగా విమానయాన కంపెనీల మధ్య పోటీ వాతావరణం పెరిగి విమాన ప్రయాణ చార్జీలు తగ్గొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వన్ఇండియా తెలుగు మనీ


Click it and Unblock the Notifications