రానున్న రెండు, నాలుగు నెలల్లో మరిన్ని సంస్కరణలు: చిదంబరం

కొనసాగుతాయని, రెండు లేదా నాలుగు నెలల్లో మరిన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రస్తుత యేడాది కరెంట్ ఖాతా లోటు 5 శాతం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందన్నారు. ద్రవ్యోల్బణం ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇది ఇలా ఉంటే పబ్లిక్‌కు 25% వాటాకు సంబంధించి లిస్టెడ్ కంపెనీలు సెబీ నిబంధనలను పాటించాలన్నారు. ఈ అంశంలో కంపెనీలకు ఎక్కువ సమయాన్ని మార్కెట్ రెగ్యులేటరీ నియంత్రణ సంస్థ సెబీ ఇచ్చిందన్నారు. సెబీ నిబంధనల ప్రకారం పబ్లిక్‌కు 2103, జూన్‌కల్లా లిస్టెడ్ ప్రైవేట్
కంపెనీలు కనీసం 25% వాటాను, పీఎస్‌యూలు 2013 ఆగస్ట్‌కల్లా కనీసం 10% వాటాను కల్పించాల్సి ఉంటుంది. పబ్లిక్‌కు కనీస వాటాకు సంబంధించి గడువు సమయాన్ని ఇప్పటికే సెబీ చాలా సార్లు పొడిగించిందని వ్యాఖ్యానించారు.
ప్రయివేట్‌గా ప్రమోట్ చేసిన కంపెనీలు కనీసం 25 శాతం వాటాను వచ్చే జూన్ కల్లా ప్రజల వద్ద ఉండేలా చాడాలని, అదే ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీలు 10 శాతం వాటాను ప్రజలకు ఇస్తే సరిపోతుందంటూ సెబీ నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. దీనితో పాటు ప్రభుత్వానికి
చెందిన కంపెనీల తుది గడువును ఆగస్టు వరకు సడలించింది. సెబీ సూచనను అమలు చేయడానికి 100కు పైగా ప్రయివేట్, ప్రభుత్వ కంపెనీలు దాదాపు రూ. 30,000 కోట్ల విలువైన షేర్లను ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది.
వన్ఇండియా తెలుగు మనీ


Click it and Unblock the Notifications
