
దీంతో సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ‘రిలీఫ్'లు కోరుతూ అలహాబాద్ హైకోర్టును సహారా ఇండియా ఆశ్రయించిందని సుప్రీంకోర్టుకు మార్కెట్ రెగ్యులేటరీ సంస్ద అయిన సెబీ తెలియజేసింది. దీంతో సుబ్రతారాయ్‌పై కోర్టు తీవ్ర అసహానం వ్యక్తం చేస్తూ మీరు కోర్టులను మోసం చేస్తున్నారని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జేఎస్ ఖేహార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. ఇన్వెస్టర్లకు చెల్లింపులపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై అసలు స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. కొంత మంది ఇన్వెస్టర్లకు సొమ్ముని తిరిగి చెల్లించేందుకు సిద్దమైనప్పటికీ.. జాడ లేని ఇన్వెస్టర్ల సొమ్మును కేంద్ర ప్రభుత్వానికి జమచేయాలని మార్కెట్ రేగ్యులేటరీ సంస్ద (సెబీ)కి సుప్రీం కోర్టు సూచించింది.
సహారా గ్రూపు సంస్థల్లో పెట్టుబడి పెట్టిన మూడుకోట్ల మంది ఇన్వెస్టర్లలో కొందరి చిరునామాలు తెలియడం లేదన్న వార్తలు సైతం సోమవారం వాదనల్లో ప్రస్తావనకు వచ్చాయి. అటువంటి ఇన్వెస్టర్ల సొమ్మును కేంద్రం వద్ద జమచేసే హాక్కు సెబీకి ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇన్వెస్టర్ల నుంచి తీసుకున్న మొత్తం రూ.24,000 కోట్లను 15 శాతం వడ్డీతో మూడు నెలల్లో చెల్లించాలని ఆగస్టు 31వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తొలుత ఆగస్టు 31వ తేదీన తాను ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా సహారా ఇండియాకు చెందిన సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ (సైరెక్), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ (షిక్) ఆస్తులను అటాచ్ చేసి బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయనందుకు సెబీని సుప్రీంకోర్టు తప్పుపట్టింది.
సహారా గ్రూప్ ఖాతాలను నిలిపివేసే అధికారం సెబీకి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. నిబంధనలకు విరుద్దంగా ఇన్వెస్టర్ల నుండి రూ. 24,000 కోట్లకు పైగా నిధులు సమీకరించిన కేసులో సహారా గ్రూప్‌లోని రెండు కంపెనీలు (సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్(ఎస్‌ఐఆర్‌ఈసీ), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ (ఎస్‌హెచ్‌ఐసీ)ల టాప్ ఎగ్జిక్యూటివ్‌ల ఆస్తులతోపాటు, 100 బ్యాంక్ ఖాతాలను కూడా జప్తు చేస్తూ సెబీ ఆదేశాలు జారీ చేసింది. సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్‌కు చెందిన షేర్లు, ఆస్తులను కూడా వెంటనే జప్తు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇక సుబ్రతో రాయ్, మరో ఇరువురు డెరైక్టర్లు- అశోక్ రాయ్ చౌదరి, రవి శంకర్ దుబేల అరెస్టును కోరుతూ సెబీ దాఖలు చేసిన పిటిషన్‌పై నోటీసులను సైతం సుప్రీంకోర్టు జారీ చేసింది. దేశం విడిచి వెళ్లకుండా ఆదేశాలు జారీచేయడానికి ప్రస్తుతానికి నిరాకరించిన కోర్టు ఈ మొత్తం వ్యవహారంలో తమ స్పందనను తెలియజేయడానికి ప్రమోటర్, రెండు గ్రూప్ సంస్థలకు వారం సమయాన్ని మంజూరు చేసింది. అలహాబాద్ హైకోర్టును సహారా ఇండియా ఆశ్రయించడానికి గల కారణాలను సుబ్రతో రాయ్ తరుపు న్యాయవాది వివరించే ప్రయత్నం చేశారు. మీరు హైకోర్టుకు వెళ్లినట్లయితే, అది ఈ కోర్టు ధిక్కరణ కిందే పరిగణించడం జరుగుతుంది. నిధుల చెల్లింపులకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తరువాత కూడా ఇందుకు సమయాన్ని పెంచాలని సెబీని కోరడం కరెక్టు కాదు. మీరు అప్పీల్ మీద అప్పీల్ ఎలా చేస్తారు? తప్పులమీద తప్పు చేసే బదులు మీరు మీ తప్పులను సరిదిద్దుకోవాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications