2013లోనే ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల విలీనం: ఛైర్మన్ ప్రతీప్ చౌధురి

అన్ని బ్యాంకుల విలీనం గురించి ఆలోచిస్తున్నామని అన్నారు. ఇది ఇలా ఉంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రింద ఉన్న ఐదు అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకుంటే ప్రపంచంలోనే అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటిగా ఎస్‌బీఐ నిలుస్తుంది. 2012-12 Q3లో 5.3 శాతంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి.... 2012-13 Q4లో 4.5 శాతానికి తగ్గాయని చెప్పారు. ఇక Q3లో రూ.52,000 కోట్లుగా ఉన్న నిరర్థక ఆస్తులు Q4లో రూ.49,000కు తగ్గాయని అన్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సీఆర్‌ఆర్‌ను 1 శాతం తగ్గిస్తే తాము బేస్ రేట్‌ను 0.20 శాతం తగ్గిస్తామని అన్నారు. విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ కోసం బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి గాను మాల్యా యూబీ గ్రూపునకు చెందిన యూనైటెడ్ స్పిరిట్ షేర్లు స్టేట్ బ్యాంకు వద్ద తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. రుణం తీసుకున్న డబ్బుని విజయ్ మాల్యా చెల్లించకపోవడంతో తనఖా పెట్టిన షేర్లను ఒపెన్ మార్కెట్లో సుమారు రూ. 100 కోట్ల షేర్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విక్రయించింది.
కింగ్‌ఫిషర్ తనఖా పెట్టిన షేర్లను విక్రయించడం కొనసాగిస్తాయని ప్రతీప్ చౌధురి చెప్పారు. తమ రుణాలను రాబట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని, కింగ్‌ఫిషర్‌కు సంబంధించి తమ వద్ద అన్ని సెక్యూరిటీలను విక్రయిస్తామని పేర్కొన్నారు. కింగ్ ఫిషర్‌కు అత్యధికంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.1,800 కోట్ల వరకు రుణాలు ఇచ్చింది. 2012 జనవరి నుంచి రూ. 7,500 కోట్లమేర బకాయిలను కింగ్‌ఫిషర్ చెల్లించకపోవడంతో యూఎస్‌ఎల్ షేర్లను విక్రయించాలని బ్యాంకులు నిర్ణయించాయి.
స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో 17 బ్యాంకులు కింగ్‌ఫిషర్‌కు రూ.7,500 కోట్ల పైగా రుణాలు ఇచ్చాయి. కంపెనీకి రుణాలిచ్చిన 17 బ్యాంకుల కన్సార్షియంలో భాగస్వామ్యులైన కీలక బ్యాంకుల నుంచి ఈ సబ్‌గ్రూప్ ఏర్పాటైంది. ఈ సబ్‌గ్రూప్‌లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), పీఎన్‌బీ, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి.
వన్ఇండియా మనీ తెలుగు


Click it and Unblock the Notifications