ముంబై: గత కొన్ని సంవత్సరాలుగా ఆకాశాన్నంటిన బంగారం ధరలు గత కొన్ని రోజులుగా క్షీణిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా దేశీయంగా 15 నెలల కనిష్ట స్దాయికి బంగారం ధర పడిపోయింది. దీనికి కారణం అంతర్జాతీయ పరిమాణాలతో పాటు అమెరికా రికవరీ ఆశలతో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనమైన బంగారం కన్నా డాలర్ల వైపుకి ఆకర్షింపబడటమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. బంగారంలో పెట్టుబడి పెట్టిన వారు లబోదిబోమని మొత్తుకుంటుంటే మరి కొందరు తగ్గిన బంగారంను ఎలా కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రపంచంలోనే అతి పెద్ద గోల్డ్ ఈటీఎఫ్ నిర్వహించే ఎస్‌పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ (జీఎల్‌డీ) బంగారం నిల్వలను తగిన మేరకు తగ్గించుకుంది. నెలరోజుల్లో ఎస్‌పీడీఆర్ నిల్వలు 22.9 టన్నులు క్షీణించి 1,158.56 టన్నులకు తగ్గాయి.

ప్రముఖ డ్యుయిష్ బ్యాంక్ గత వారం బంగారం ధరలు విపరీతంగా తగ్గుతాయని అంచనా వేసింది. దీనితోపాటు 2000వ సంవత్సరం నుండి మెటల్ రంగంలో రిటర్న్ అతి తక్కువగా రావడం ఇప్పుడేనని పేర్కొంది.

ఇటీవలే గోల్డ్‌మన్ శాక్స్ మూడు నెలల అంచనాలను.. 1,615 డాలర్ల నుంచి 1,530 డాలర్లకు, ఏడాది అంచనాలను 1,550 డాలర్ల నుంచి 1,390 డాలర్లకు తగ్గించింది. కానీ, ఈ అంచనాలన్నింటినీ తలదన్నుతూ పసిడి పతనమైపోతోంది. ‘బంగారం తగ్గుతుండటం చాలా మంచి పరిణామం. ఎందుకంటే.. కొనాలనుకుంటున్న వారందరికీ దీని వల్ల బంగారం లాంటి అవకాశం వస్తుంది' అని ఇన్వెస్ట్‌మెంట్ గురు మార్క్ ఫేబర్ వ్యాఖ్యానించారు.

ఈ నెల మొదట్లో సొసైటీ జనరల్ ఇచ్చిన తన నివేదికలో "బంగారం ధర బుడగ మాదిరి ఉందని అభివర్ణించింది." ఈ అంచనా తర్వాత బంగారం ధరలు ఇటీవలే భారీగా క్షీణించిన విషయం తెలిసిందే.

క్రెడిట్ సూసీ ఈ నెలతో పాటు సంవత్సరంలో కూడా బంగారం ధరలు గణనీయంగా తగ్గుతాయని పేర్కొంది. ప్రస్తుతం బంగారంపై ఆసక్తి తగ్గిందని, ఇన్వెస్టర్లు ఇతర సాధనాలవైపు చూస్తున్నారని ట్రేడర్లు పేర్కొన్నారు. ఆర్దిక సంక్షోభం నుండి బయట పడేందుకు సైప్రస్ యూరోపియన్ దేశాలు తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్మేయొచ్చన్న అంచనాలు ఇందుకు కారణమని వారు పేర్కొన్నారు.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!



Click it and Unblock the Notifications