
సెబీ విచారణ తర్వాత రాయ్ విలేకరులతో మాట్లాడుతూ తన వ్యక్తిగత ఆస్తుల గురించే సెబీ ప్రశ్నించిందని అన్నారు. నా ఆస్తుల వివరాలను చూస్తే బంగారు ఆభరణాలు ఇతరత్రా కలిపి వ్యక్తిగతంగా నా ఆస్తి మొత్తం రూ 3 కోట్లు. ఇందులో రూ 34 లక్షల నగదు, బ్యాంక్ బ్యాలెన్స్, రూ 1.59 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. చక్కెర మిల్లుల కొనుగోలు కోసం రూ.11 కోట్ల రుణం తీసుకున్నాను. ఇక స్థిరాస్తులు అంటూ ఏమీ లేవని రాయ్ పేర్కొన్నారు. ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన బకాయి సొమ్ము సెబి వద్దనే ఉందన్నారు. ఇన్వెస్టర్ల డబ్బు వీలైనంత త్వరగా వారి డబ్బు వారికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రాయ్ అన్నారు. సెబి గత నాలుగు నెలల నుంచి ఇన్వెస్టర్ల వివ రాలను పూర్తిస్థాయిలో తెలుసుకుని ఉండాల్సిందని ఆయన అన్నారు.
చాలా మంది ఇన్వెస్టర్లకు సొమ్మును తిరిగి చెల్లించేశామని, ఇంకా చెల్లించాల్సిన రూ. 5,120 కోట్ల నగదు సెబీ వద్దే ఉందని సుబ్రతో రాయ్ పేర్కొన్నారు. తనిఖీ ప్రక్రియ ప్రారంభానికి ముందే తాము సమర్పించిన ఖాతాలన్నీలొసుగులు ఉన్నాయని సెబీ ఆరోపించడం హాస్యాస్పదం అన్నారు. గంటపాటు ప్రశ్నించిన సెబీ... తమకు కనీసం కప్పు టీ కూడా ఇవ్వలేదని వాపోయారు.
నిన్న జరిగిన సమావేశంలో వ్యక్తిగత ఆస్తులు, కంపెనీ పెట్టుబడులు... ఎక్కడెక్కడ ఆస్తులుకొనుగోలు చేసింది తదితర వివరాలు సెబి అడిగి తెలుసుకుంది. డిపాజిటర్లకు ఈ స్థిరాస్తులు విక్రయించి డబ్బు చెల్లించేందుకు వివరాలు అడిగి తెలుసుకుంది. సహారాకు చెందిన రెండు కంపెనీలు సహారా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్‌ఐఆర్‌ఈసీఎల్), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్‌హెచ్‌ఐసీఎల్) పేరుపై కొనుగోలు చేసిన స్థిరాస్తుల టైటిల్ డీడ్స్ (ఒరిజినల్) తమ ముందు ప్రవేశ పెట్టాలని నలుగురు డైరెక్టర్లను ఆదేశించింది.
కేసు పూర్తి వివరాలు:
బాండ్‌ల జారీ ద్వారా దాదాపు 3 కోట్ల మంది ఇన్వెస్టర్ల నుంచి సహారా గ్రూప్‌నకు చెందిన సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ రూ.6,380 కోట్లు, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ రూ.19,400 కోట్లను సమీకరించాయి. ఈ నిధుల సమీకరణలో ఈ రెండు కంపెనీలు పలు అవకతవకలను పాల్పడ్డాయనేది సెబీ ఆరోపణ. ఈ కేసులో సుప్రీం కోర్టు గతేడాది ఆగస్టులో ఈ రూ.24,000 కోట్లకు పైగా మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సిందిగా సహారా గ్రూప్ కంపెనీలను ఆదేశించింది.
నిబంధనలకు విరుద్దంగా ఇన్వెస్టర్ల నుండి రూ. 24,000 కోట్లకు పైగా నిధులు సమీకరించిన కేసులో సహారా గ్రూప్‌లోని రెండు కంపెనీలు (సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్(ఎస్‌ఐఆర్‌ఈసీ), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ (ఎస్‌హెచ్‌ఐసీ)ల టాప్ ఎగ్జిక్యూటివ్‌ల ఆస్తులతోపాటు, 100 బ్యాంక్ ఖాతాలను కూడా జప్తు చేస్తూ సెబీ ఆదేశాలు జారీ చేసింది. సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్‌కు చెందిన షేర్లు, ఆస్తులను కూడా వెంటనే జప్తు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసు విషయంలో ఈ నెల 6న సుప్రీం కోర్టు జారీ చేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో మార్కెట్ రెగ్యులేటర్ సంస్ద (సెబీ)చర్యలు తీసుకుంది.
జప్తునకు ఆదేశించిన ఆస్తులలో గ్రూప్‌నకు చెందిన పుణేలోని ఆంబీ వ్యాలీ రిసార్ట్ టౌన్‌తోసహా ఢిల్లీ, ముంబైలలోగల ఇతర రియల్టీ ఆస్తులు కూడా ఉన్నాయి. ఫిబ్రవరి 6వ తారీఖున సుబ్రోతో రాయ్‌కు చెందిన సహారా గ్రూపుకి చెందిన రెండు కంపెనీల ఆస్తుల జప్తుకు మార్కెట్ రెగ్యులేటర్ సంస్ద అయిన సెబీకి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుప్రీం కోర్టు ఆర్డర్‌ను ధిక్కరించినందుకు సహారాకు చెందిన రెండు కంపెనీల ఖాతాలతో పాటు ఆస్తులను స్వాధీనం చేసుకునే హక్కు కల్పించింది. దీంతో ఇన్వెస్టర్లకు రూ. 24,000 కోట్లను చెల్లించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలుచేయడంలో విఫలమైన గ్రూప్ రెండు కంపెనీల అకౌంట్లను స్తంభింపజేసి, ఆస్తులను జప్తు చేసే సంపూర్ణ అధికారాలు సెబీకి లభించాయి.
కాగా, రాయ్ అరెస్టుకు అనుమతితో పాటు, దేశం విడిచిపోకుండా ఆదేశించాలంటూ సెబీ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా సుప్రీం కోర్టు ఈ నెలలోనే విచారించనుంది. డిపాజిట్ల చెల్లించాల్సిన కేసుకు సంబంధించి సహారా గ్రూప్ ఇన్వెస్టర్లను బెదిరిస్తోందన్న ఆరోపణలపై పోలీసులు రంగంలోకి దిగారు. ఈ మేరకు వచ్చిన ఫిర్యాదు విషయంలో సహారా గ్రూపుపై ప్రాథమిక దర్యాప్తు మొదలు పెట్టినట్లు ముంబై పోలీసు ఆర్థిక నేరాల విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications