
ప్రస్తుతం మా వద్ద ఉన్న ఈ నిధులతో విమానాల పనులు నిర్వహించడానికి, ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి సరిపోతాయని పేర్కొన్నారు. ఎలాగైనా సరే ఎయిర్‌లైన్స్ పునః ప్రారంభించడానికి అన్న చర్యలు తీసుకుంటున్నట్లు సంజయ్ అగర్వాల్ పేర్కొన్నారు. కింగ్‌ఫిషర్ సమర్పించిన ఈ ప్రణాళికపై డీజీసీఏ త్వరలో ఓ నిర్ణయం తీసుకోనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం రూ. 7000 కోట్లకుపైగా అప్పులు ఉన్నాయి. గతేడాది అక్టోబర్ 1న కంపెనీ ప్లయింగ్ లెసైన్స్‌ను కేంద్రం సస్పెండ్ చేయగా.. డిసెంబర్ 31తో లెసైన్స్ గడువు కూడా ముగిసింది. రుణ సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఇచ్చిన రుణాలను వసూలు చేసేందుకు గాను నాలుగు ప్రధాన బ్యాంకులు కలిసి ఒక సబ్ గ్రూప్‌గా ఏర్పడ్డాయి. గతంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో 17 బ్యాంకులు కింగ్‌ఫిషర్‌కు రూ.7,500 కోట్ల పైగా రుణాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కంపెనీకి రుణాలిచ్చిన 17 బ్యాంకుల కన్సార్షియంలో భాగస్వామ్యులైన కీలక బ్యాంకుల నుంచి ఈ సబ్‌గ్రూప్ ఏర్పాటైంది. ఈ సబ్‌గ్రూప్‌లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), పీఎన్‌బీ, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే ఇటీవల రుణ సంక్షోభంలో చిక్కుకుపోయి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడగా.. ఇప్పుడు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు అప్పులిచ్చిన బ్యాంకులు యూనైటెడ్ స్పిరిట్ షేర్లను అమ్ముకోవచ్చంటూ ముంబై హైకోర్టు తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే... లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ కోసం బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి గాను మాల్యా యూబీ గ్రూపునకు చెందిన యూనైటెడ్ స్పిరిట్ షేర్లు స్టేట్ బ్యాంకు వద్ద తనఖా పెట్టి రుణం తీసుకున్నారు.
రుణం తీసుకున్న డబ్బుని విజయ్ మాల్యా చెల్లించకపోవడంతో తనఖా పెట్టిన షేర్లను ఒపెన్ మార్కెట్లో సుమారు రూ. 100 కోట్ల షేర్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విక్రయించింది. దీంతో విజయ్ మాల్యా ముంబై హైకోర్టును ఆశ్రయించి తక్షణమే తనఖా పెట్టిన షేర్లను విక్రయించరాదని ఆదేశించాలని కోర్టును కోరారు. ఇందుకు అభ్యంతరం చెబుతూ కింగ్‌ఫిషర్ మాతృ సంస్థ విజయ్ మాల్యాకు చెందిన యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను జస్టిస్ ఎస్‌జే కట్టావాలా తిరస్కరించారు. యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్‌తోపాటు, రుణాలిచ్చిన 17 బ్యాంకుల కన్సార్షియం తమ వాదనలను బొంబాయి హైకోర్టుకి వినిపించాయి. రుణాల చెల్లింపులో కింగ్‌ఫిషర్ విఫలంకావడంతో ఇప్పటికే తాము తనఖాలో ఉన్న షేర్ల విక్రయాన్ని మొదలుపెట్టినట్లు వాదనలో భాగంగా బ్యాంకులు హైకోర్టుకి తెలిపాయి. దీంతో కింగ్‌ఫిషర్‌కు రుణాలిచ్చిన బ్యాంకులు సెక్యూరిటీగా తమ తనఖాలో ఉన్న షేర్లను విక్రయించుకోవచ్చునంటూ ముంబై హైకోర్టు స్పష్టం చేసింది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications