సుబ్రతో రాయ్‌కి చెందిన సహారా నుంచి తప్పుకున్న ముగ్గురు డైరెక్టర్లు

అంతక ముందు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సహారా గ్రూప్ తమ యొక్క డిపాజిట్ దార్ల నుండి సేకరించిన రూ. 24 వేల కోట్లను తిరిగి చెల్లించనందుకు సుబ్రతోరాయ్ అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని మార్కెట్ రెగ్యులేటరీ సంస్ద సెబీ భారతదేశ అత్యున్నత న్యాయ స్దానం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సహారా ధిక్కరించినందున ఆ సంస్ద ఛైర్మన్ సుబ్రతో రాయ్‌తో పాటు మరో ఇద్దరు డైరెక్టర్లను అరెస్టుకు అనుమతించాలని సుప్రీం కోర్టును సెబీ కోరింది.
ఇన్వెస్టర్ల నుంచి తీసుకున్న మొత్తం రూ.24,000 కోట్లను 15 శాతం వడ్డీతో మూడు నెలల్లో చెల్లించాలని ఆగస్టు 31వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తొలుత ఆగస్టు 31వ తేదీన తాను ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా సహారా ఇండియాకు చెందిన సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ (సైరెక్), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ (షిక్) ఆస్తులను అటాచ్ చేసి బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయనందుకు సెబీని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. సహారా గ్రూప్ ఖాతాలను నిలిపివేసే అధికారం సెబీకి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది.
నిబంధనలకు విరుద్దంగా ఇన్వెస్టర్ల నుండి రూ. 24,000 కోట్లకు పైగా నిధులు సమీకరించిన కేసులో సహారా గ్రూప్‌లోని రెండు కంపెనీలు (సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్(ఎస్‌ఐఆర్‌ఈసీ), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ (ఎస్‌హెచ్‌ఐసీ)ల టాప్ ఎగ్జిక్యూటివ్‌ల ఆస్తులతోపాటు, 100 బ్యాంక్ ఖాతాలను కూడా జప్తు చేస్తూ సెబీ ఆదేశాలు జారీ చేసింది. సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్‌కు చెందిన షేర్లు, ఆస్తులను కూడా వెంటనే జప్తు చేస్తున్నట్లు ప్రకటించింది.
వన్ఇండియా మనీ తెలుగు


Click it and Unblock the Notifications